
సాక్షి, విజయవాడ : నారాయణ కాలేజ్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చోటుచేసుకోవడంతో కలకలం రేగుతోంది. ఇంటర్ చదువుతున్న శ్రీచరణ్ మృతిపై విచారణ జరపాలని విద్యార్థుల సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసమర్ధ మంత్రుల వల్లే కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.