దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు
కామారెడ్డి టౌన్: ఎంసెట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్రీచైత న్య, నారాయణ విద్యాసంస్థలను మూసివేయాల ని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎన్. ఆజాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద విద్యాసంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో శ్రీ చైతన్య డీన్ వాసుబాబు ను అరెస్ట్ చేశారని, ఇందుకు వారి విద్యాసంస్థలను తక్షణమే ప్రభుత్వం మూసివేయాలని డి మాండ్ చేశారు.
ర్యాంకుల పేరుతో లక్షలాదిగా వసూలు చేసుకోవడానికి తల్లిదండ్రులను, విద్యార్థులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులపై ర్యాంకుల కోసం తీవ్రమానసిక ఒత్తిడికి గురిచేయడంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఈ విద్యాసంస్థల్లో ఉన్నాయన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్, విఠల్, ఉపాధ్యక్షులు నిమ్మ సురేష్, నాయకులు శేఖర్, రమేశ్, ప్రకాశ్, క్రిష్ణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment