narayana students
-
నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలను మూసివేయాలి
కామారెడ్డి టౌన్: ఎంసెట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్రీచైత న్య, నారాయణ విద్యాసంస్థలను మూసివేయాల ని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎన్. ఆజాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద విద్యాసంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో శ్రీ చైతన్య డీన్ వాసుబాబు ను అరెస్ట్ చేశారని, ఇందుకు వారి విద్యాసంస్థలను తక్షణమే ప్రభుత్వం మూసివేయాలని డి మాండ్ చేశారు. ర్యాంకుల పేరుతో లక్షలాదిగా వసూలు చేసుకోవడానికి తల్లిదండ్రులను, విద్యార్థులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులపై ర్యాంకుల కోసం తీవ్రమానసిక ఒత్తిడికి గురిచేయడంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఈ విద్యాసంస్థల్లో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్, విఠల్, ఉపాధ్యక్షులు నిమ్మ సురేష్, నాయకులు శేఖర్, రమేశ్, ప్రకాశ్, క్రిష్ణ ఉన్నారు. -
ఒలంపియాడ్స్‌లో నారాయణ విద్యార్ధుల ప్రతిభ
-
యూసీఓకు 69మంది నారాయణ విద్యార్థులు ఎంపిక
రాజంపేట రూరల్: యూనిఫైడ్ ఫైబర్ ఒలంపియాడ్ పరీక్ష రెండవ దశకు నారాయణ విద్యార్థులు ఎంపికైనట్లు డీన్ సయ్యద్‌ఖాన్ తెలియచేశారు. స్థానిక నారాయణ హైస్కూల్లో ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీన్ సయ్యద్ ఖాన్ మాట్లాడుతూ హైదరాబాదుకు చెందిన వారు యూసీఓ మొదటి దశ పరీక్షలను నిర్వహించారన్నారు. అందులో తమ పాఠశాలలోని 69మంది విద్యార్థులు రెండవ దశకు ఎంపికయ్యారన్నారు. ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రతిభ చాటడం శుభపరిణామమన్నారు. పాఠశాలలోని నారాయణ విద్యాసంస్థల యొక్క విద్య కరికులం దానిని అమలు పరిచే ప్రతిష్ట ప్రణాళిక ప్రధాన కారణమన్నారు. సమగ్ర విశ్లేషణ విద్యార్థులకు చేయడం విజయానికి కారణమన్నారు. రెండవ దశ పరీక్షల్లో సైతం విజయం సాధించి మిగిలిన విద్యార్థులకు మార్గదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం డీవీ రవిబాబు, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, సుబాషిణి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘అండర్–19’ విజేత నారాయణ
ఒంగోలు: అండర్–19 సెంట్రల్ జోన్ విజేతగా ఒంగోలు నారాయణ జూనియర్ కాలేజీ జట్టు నిలిచింది. స్థానిక ఏబీఎం డిగ్రీ కాలేజీలో గురువారం సెంట్రల్ జోన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఒంగోలు నారాయణ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో కందుకూరు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 59 పరుగులు చేసి టీఆర్ఆర్ జట్టు ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణ జట్టు 11 ఓవర్లలో లక్షా్యన్ని ఛేదించి జయకేతనం ఎగురవేసింది. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లను ఆర్ఐఓ రమేశ్‌బాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటూ ఆటల్లోనూ రాణించి ఉజ్వల భవిష్యత్ సాధించాలని ఆకాంక్షించారు. అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎం హరనాథబాబు, ఏబీఎం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మోజెస్ దయానందం, ఫిజికల్ డైరెక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వరరావు, కార్యదర్శి నరసింహారావు, ఏబీఎం జూనియర్ కాలేజీ పీడీ కే డేవిడ్‌రాజు, రాజు, కాశీరత్నం పాల్గొన్నారు.