రాజంపేట రూరల్: యూనిఫైడ్ ఫైబర్ ఒలంపియాడ్ పరీక్ష రెండవ దశకు నారాయణ విద్యార్థులు ఎంపికైనట్లు డీన్ సయ్యద్‌ఖాన్ తెలియచేశారు. స్థానిక నారాయణ హైస్కూల్‌లో ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీన్ సయ్యద్ ఖాన్ మాట్లాడుతూ హైదరాబాదుకు చెందిన వారు యూసీఓ మొదటి దశ పరీక్షలను నిర్వహించారన్నారు. అందులో తమ పాఠశాలలోని 69మంది విద్యార్థులు రెండవ దశకు ఎంపికయ్యారన్నారు. ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రతిభ చాటడం శుభపరిణామమన్నారు. పాఠశాలలోని నారాయణ విద్యాసంస్థల యొక్క విద్య కరికులం దానిని అమలు పరిచే ప్రతిష్ట ప్రణాళిక ప్రధాన కారణమన్నారు. సమగ్ర విశ్లేషణ విద్యార్థులకు చేయడం విజయానికి కారణమన్నారు. రెండవ దశ పరీక్షల్లో సైతం విజయం సాధించి మిగిలిన విద్యార్థులకు మార్గదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం డీవీ రవిబాబు, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, సుబాషిణి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.