pdsu protest
-
అశ్లీల చిత్రాలకు అడ్డుకట్ట వేయండి
ముషీరాబాద్: యువతను పెడదారి పట్టించే డిగ్రీ కాలేజీ, ఏడు చేపల కథ తదితర సినిమాలను విడుదల కాకుండా అడ్డుకోవాలని పీవైఎల్, పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల వస్తున్న అశ్లీల సినిమాలు, సన్నివేశాలను నియంత్రించాలని కోరుతూ సోమవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ను పీవైఎల్, పీడీఎస్యూ ప్రతినిధి బృందం కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్ ప్రదీప్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు మాట్లాడుతూ... ఇటీవల విడుదలవుతున్న సినిమాల్లో అశ్లీల దృశ్యాలు అభ్యంతరకరంగా, ఇబ్బందికరంగా ఉంటున్నాయని, ఫోర్న్ సీన్లు ఉంటేనే సినిమాలు చూస్తున్నారని దర్శక, నిర్మాతలు బహిరంగంగా పేర్కొనడం దారుణమన్నారు. తాజాగా ‘‘ డిగ్రీ కాలేజీ’’ ‘‘ఏడు చేపల కథ’’ తదితర అశ్లీల సినిమాలు విడుదల కాబోతున్నాయన్నారు. ఈ సినిమాలు ‘ఏ’ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ, వీటికి ప్రధానంగా టీనేజీ యువతే ఆకర్షితులు అవుతున్నారని, పోస్టర్లు కూడా అసభ్యకరంగా వేస్తున్నారన్నారు. దీనిపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో యువత వీటికి ప్రేరేపితులై చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు., ఇలాంటి సినిమాలను నిలిపివేయాలని, సదరు దర్శక, నిర్మాతలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినిధి బృందంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.భాస్కర్, ఓయూ నాయకురాలు జ్యోతి, పీవైఎల్ నాయకులు పి.సృజన్, కళ్యాణ్, డీవీఎస్.కృష్ణ తదితరులు ఉన్నారు. పీవైఎల్, పీడీఎస్యూ నాయకులు -
కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలి
తుంగతుర్తి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మ ధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పీడీఎస్యూ జిల్లా అ«ధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ డి మాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచి, మరుగుదొడ్లు, మూత్రశాలలు, యూనిఫాం, ఉచి త బస్సు సౌకర్యం కల్పించడంతోపా టుఅదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పి అమలుతో విఫలమైందన్నారు. ఆన్లైన్ అడ్మిషన్లు నిర్వహించకపోవడంతో కార్పోరేట్ కళాశాలలు వందల సంఖ్యలో బ్రాంచిలు ఏర్పా టు చేసి విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రా ష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన లింగయ్య, వేణు, రాజు, యాకన్న, శ్రావణి, శిరీష, ఝాన్సీ, ప్రసన్న, మమత, శృతి, కల్యాణి, రవి, సాయి, గణేష్, వెంకన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ లెనిన్ సెంటర్లో విద్యార్థి సంఘాల ధర్నా
-
నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలను మూసివేయాలి
కామారెడ్డి టౌన్: ఎంసెట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్రీచైత న్య, నారాయణ విద్యాసంస్థలను మూసివేయాల ని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎన్. ఆజాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద విద్యాసంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడా రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో శ్రీ చైతన్య డీన్ వాసుబాబు ను అరెస్ట్ చేశారని, ఇందుకు వారి విద్యాసంస్థలను తక్షణమే ప్రభుత్వం మూసివేయాలని డి మాండ్ చేశారు. ర్యాంకుల పేరుతో లక్షలాదిగా వసూలు చేసుకోవడానికి తల్లిదండ్రులను, విద్యార్థులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులపై ర్యాంకుల కోసం తీవ్రమానసిక ఒత్తిడికి గురిచేయడంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఈ విద్యాసంస్థల్లో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్, విఠల్, ఉపాధ్యక్షులు నిమ్మ సురేష్, నాయకులు శేఖర్, రమేశ్, ప్రకాశ్, క్రిష్ణ ఉన్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పీడీఎస్యూ నాయకులు ఆర్ట్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నేత శ్రీనివాస్ మాట్లాడుతూ హాస్టళ్లకు పక్కా భవనాలు లేవని, సరైన మెను ఇవ్వడం లేదన్నారు. పాలిష్ చేసిన దొడ్డు బియ్యాన్ని హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారని అన్నారు. ప్రతి హాస్టల్కు ఏఎన్ఎంను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి మెస్ చార్జీల కింద నెలకు రూ.2,500 కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు నరసింహారావు, పైండ్ల యాకయ్య, దుర్గం సారయ్య, రవీందర్, నరేష్, తిరుపతి, వేణు తదితరులు పాల్గొన్నారు.