ధర్నా చేస్తున్న పీడీఎస్‌యూ నాయకులు
తుంగతుర్తి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మ ధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అ«ధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ డి మాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచి, మరుగుదొడ్లు, మూత్రశాలలు, యూనిఫాం, ఉచి త బస్సు సౌకర్యం కల్పించడంతోపా టుఅదనపు తరగతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పి అమలుతో విఫలమైందన్నారు.
ఆన్‌లైన్ అడ్మిషన్లు నిర్వహించకపోవడంతో కార్పోరేట్ కళాశాలలు వందల సంఖ్యలో బ్రాంచిలు ఏర్పా టు చేసి విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రా ష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన లింగయ్య, వేణు, రాజు, యాకన్న, శ్రావణి, శిరీష, ఝాన్సీ, ప్రసన్న, మమత, శృతి, కల్యాణి, రవి, సాయి, గణేష్, వెంకన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment