సింధు సినిమా కూడా... | Sonu Sood to make a biopic on shuttler PV Sindhu | Sakshi
Sakshi News home page

సింధు సినిమా కూడా...

May 2 2017 12:40 AM | Updated on Sep 5 2017 10:08 AM

సింధు సినిమా కూడా...

సింధు సినిమా కూడా...

ముంబై: భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌పై సినిమాలు నిర్మించే సీజన్‌ ఇప్పుడు నడుస్తున్నట్లుంది!

బ్యాడ్మింటన్‌ స్టార్‌పై బయోపిక్‌కు సన్నాహాలు

ముంబై: భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌పై సినిమాలు నిర్మించే సీజన్‌ ఇప్పుడు నడుస్తున్నట్లుంది! కొన్నాళ్ల క్రితమే పుల్లెల గోపీచంద్‌పై సినిమా తీయనున్నారనే వార్తలు రాగా... సైనా నెహ్వాల్‌ పాత్రలో శ్రద్ధా కపూర్‌ నటించనుందనే అధికారిక ప్రకటన వచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పూసర్ల వెంకట సింధుపై సినిమా నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. సింధు ‘బయోపిక్‌’ను తాను నిర్మిస్తున్నట్లు నటుడు, నిర్మాత సోనూ సూద్‌ ప్రకటించారు. రియోలో సింధు పతకం గెలిచిన తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిందని, అప్పటి నుంచి సింధు జీవిత, కెరీర్‌ విశేషాలపై తమ బృందం స్క్రిప్ట్‌ తయారు చేసే పనిలో పడ్డట్లు సూద్‌ వెల్లడించారు.

ఈ చిత్రంలో సింధు పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సూద్‌ చెప్పారు. తనపై చిత్రం రానుండటం పట్ల సింధు సంతోషం వ్యక్తం చేసింది. ‘నా ప్రయాణంపై సోనూ సూద్‌ సినిమా నిర్మించాలని నిర్ణయించుకోవడం గౌరవంగా భావిస్తున్నా. గత ఎనిమిది నెలల శ్రమతో వారు రూపొందించిన స్క్రిప్ట్‌ నన్ను ఆకట్టుకుంది. ఇది కచ్చితంగా లక్షలాది మందిలో స్ఫూర్తి నింపుతుందని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా యువత తమ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రోత్సహించేలా ఉంటుందని ఆశిస్తున్నా’ అని సింధు స్పందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement