ఫేవరెట్‌గా సింధు | Korea open from today | Sakshi
Sakshi News home page

ఫేవరెట్‌గా సింధు

Published Tue, Sep 12 2017 12:32 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

ఫేవరెట్‌గా సింధు

ఫేవరెట్‌గా సింధు

నేటి నుంచి కొరియా ఓపెన్‌ 
∙ సైనా, శ్రీకాంత్‌ గైర్హాజరు

 
సియోల్‌:
ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ రన్నరప్, భారత స్టార్‌ పూసర్ల వెంకట సింధు కొరియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నేటి నుంచి జరిగే ఈ ఈవెంట్‌లో ఆమెకు ఐదో సీడింగ్‌ దక్కింది. తొలి రోజు క్వాలిఫయింగ్‌ పోటీలు, బుధవారం నుంచి మెయిన్‌ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల సింగిల్స్‌ మెయిన్‌ డ్రా తొలి రౌండ్‌ పోరులో హైదరాబాదీ టాప్‌ స్టార్‌ చెంగ్‌ ఎన్గన్‌ యి (హాంకాంగ్‌)తో తలపడనుంది. ఈ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ తప్పుకున్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న జపాన్‌ ఓపెన్‌ కోసం వీళ్లిద్దరు ప్రస్తుతం గోపీచంద్‌ అకాడమీలో సన్నద్ధమవుతున్నారు.

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి చాంపియన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్లో ఎన్గ్‌ క లాంగ్‌ అంగస్‌ (హాంకాంగ్‌)తో పోటీపడనున్నాడు. సింగపూర్‌ ఓపెన్‌ చాంపియన్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ కూడా హాంకాంగ్‌కే చెందిన హు యున్‌తో తలపడతాడు. మిగతా మ్యాచ్‌ల్లో సమీర్‌ వర్మ... తనోంగ్‌సక్‌ సాన్సోంబూన్సుక్‌ (థాయ్‌లాండ్‌)తో, సౌరభ్‌ వర్మ క్వాలిఫయర్‌తో ఆడనున్నారు.  నేడు జరిగే క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో లిన్‌ యు సియెన్‌ (చైనీస్‌ తైపీ)తో పారుపల్లి కశ్యప్‌ తలపడతాడు. డబుల్స్‌ క్వాలిఫయింగ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి ద్వయం... జాంగ్‌ వూ చొ–హూ తే కిమ్‌ (కొరియా) జంటతో పోటీపడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement