Korea Open
-
వరుస విజయాలు.. కెరీర్ బెస్ట్ అందుకున్న సాత్విక్-చిరాగ్ జోడి
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం ఆదివారం కొరియా ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో నాలుగో సూపర్ బ్యాడ్మింటన్ టైటిల్ దక్కించుకున్న ఈ జోడి ప్రస్తుతం సూపర్ ఫామ్ కనబరుస్తోంది. తాజాగా మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. సాత్విక్-చిరాగ్ జోడి డబుల్స్ విభాగంలో తమ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ అందుకోవడం విశేషం. ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన వరల్డ్ డబుల్స్ నెంబర్‌వన్ జోడి ఫజర్ అల్‌పయాన్- ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. కొరియా ఓపెన్ కంటే ముందు ఇదే సీజన్లో స్విజ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, ఆసియన్ చాంపియన్స్ గెలిచిన ఈ జోడి ఖాతాలో 87,211 ర్యాంకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో భాగంగా వీరిద్దరూ ఈ సీజన్లో ఆడిన 10 ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో కూడా ఓటమిపాలవ్వలేదు. కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న సాత్విక్-చిరాగ్ జోడి జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీపై కన్నేసింది. మంగళవారం నుంచి ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇక తెలుగుతేజం పీవీ సింధు వరుస పరాజయాలతో ర్యాంకింగ్స్‌లో మరింత దిగజారుతూ వస్తోంది. కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సింధు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 17వ స్థానంలో ఉంది. గాయంతో దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ 37వ స్థానంలో ఉండగా.. పరుషుల సింగిల్స్ విభాగంలో భారత టాప్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ 10వ స్థానాన్ని నిలుపుకోగా.. కొరియా ఓపెన్‌కు దూరంగా ఉన్న లక్ష్యసేన్ ఒక స్థానం కోల్పోయి 13వ స్థానంలో ఉన్నాడు. ఇక కిడాంబి శ్రీకాంత్ 20వ స్థానంలో నిలిచాడు. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ దూరం ఎంబాపెకు బంపరాఫర్.. ఏకంగా రూ. 2,716 కోట్లు! -
ఎదురులేని సాత్విక్–చిరాగ్ జోడీ
యోసు (కొరియా): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ తమ ఖాతాలో నాలుగో టైటిల్‌ను జమ చేసుకుంది. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 17–21, 21–13, 21–14తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్ తొలి గేమ్‌లో తడబడినా వెంటనే తేరుకొని తర్వాతి రెండు గేమ్‌లను దక్కించుకున్నారు. తొలి గేమ్‌లో ఒకదశలో 2–10తో వెనుకబడ్డ భారత జోడీ ఆ తర్వాత అంతరాన్ని తగ్గించినా గేమ్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అయితే రెండో గేమ్ నుంచి సాత్విక్, చిరాగ్ ఆట మారింది. ముఖ్యంగా సాత్విక్ తిరుగులేని స్మాష్‌లతో చెలరేగాడు. ఫలితంగా స్కోరు 15–11 వద్ద భారత జోడీ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 20–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు పాయింట్లు చేజార్చుకున్నా వెంటనే మరో పాయింట్ నెగ్గి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్–చిరాగ్ ఆరంభంలోనే 7–3తో ఆధిక్యంలోకి వెళ్లి ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 33,180 డాలర్ల (రూ. 27 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘వరుసగా టైటిల్స్ గెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వారం మాకెంతో అద్భుతంగా గడిచింది. ఈ టోర్నీ మొత్తం గొప్పగా ఆడాం. మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. మంగళవారం నుంచి జరిగే జపాన్ ఓపెన్‌లో మా జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాం’ అని సాత్విక్, చిరాగ్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందన సాక్షి,అమరావతి: కొరియా ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో జరిగే టోర్నీల్లోనూ వీరిద్దరూ విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. 4 ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ నెగ్గిన టైటిల్స్. స్విస్ ఓపెన్ సూపర్–300, ఆసియా చాంపియన్‌షిప్, ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీలలో టైటిల్స్ గెలిచారు. -
టైటిల్‌కు అడుగు దూరంలో సాత్విక్–చిరాగ్ జోడీ
యోసు (కొరియా): గత నెల ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి వరుసగా రెండో టైటిల్‌కు చేరువయ్యారు. కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అగ్రశ్రేణి భారత జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకు జంట సాత్విక్–చిరాగ్ 21–15, 24–22తో రెండో సీడ్ లియాంగ్ వే కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయంపై గెలుపొందింది. ప్రపంచ రెండో ర్యాంకులో ఉన్న చైనీస్ ప్రత్యర్థులపై భారత షట్లర్లకు ఇదే తొలి విజయం! గతంలో తలపడిన రెండు సార్లూ సాత్విక్–చిరాగ్‌లకు నిరాశే ఎదురైంది. తాజా సెమీస్‌లో భారత ద్వయం జోరుకు చైనీస్ జంటకు ఓటమి తప్పలేదు. వరుస గేముల్లో గెలిచినప్పటికీ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగింది. 3–3 నుంచి 5–5 ఇలా స్కోరు పోటాపోటీగా కదిలింది. సాత్విక్–చిరాగ్ 7–5 స్కోరు వద్ద ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ చైనా స్టార్లు స్మాష్‌లతో మళ్లీ సమం చేశారు. అయితే నెట్ వద్ద లియాంగ్ అనవసర తప్పులు చేయడంతో భారత్ 14–8తో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సంపాదించి తొలి గేమ్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లో పోటీ మరింత పెరిగింది. ఆరంభం నుంచి 2–2, 8–8 వద్ద వరుస విరామాల్లో స్కోర్లు సమం కావడంతో ఇరు జోడీలు పైచేయి సాధించేందుకు శ్రమించారు. సాత్విక్ స్మాష్‌లతో రెచ్చిపోయాడు. వరుస పాయింట్లతో 11–8తో ఆధిక్యంలోకి వచ్చిన భారత జోడీ దీన్ని 14–9తో పెంచుకుంది. కానీ లియాంగ్, వాంగ్ క్రాస్‌కోర్టు షాట్లకు పదునుపెట్టడంతో పోటాపోటీ మళ్లీ మొదటికొచ్చింది. ఇక్కడినుంచి ఆఖరి దశ దాకా హోరాహోరీ కొనసాగడంతో 20–20, 22–22 వద్ద స్కోర్లు సమమయ్యాయి. తర్వాత నాలుగోసారి దక్కిన మ్యాచ్ పాయింట్‌ను ఈ సారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా సాత్విక్ తెలివిగా స్మాష్‌లతో ముగించాడు. నేడు జరిగే తుదిపోరులో భారత జోడీ టాప్ సీడ్ ఫజర్ అలి్పయాన్–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) జంటతో తలపడుతుంది. -
సెమీఫైనల్లో సాత్విక్ జోడీ
యోసు (కొరియా): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకు జంట వరుస సెట్లలో ఐదో సీడ్ టకురో హొకి–యుగొ కొబయషి (జపాన్) ద్వయంపై అలవోక విజయం సాధించింది. 40 నిమిషాల్లో ముగిసిన ఈ క్వార్టర్స్ పోరులో సాత్విక్–చిరాగ్ జోడీ 21–14, 21–17తో జపాన్ ద్వయంపై గెలుపొందింది. గత నెల ఇండోనేసియా ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గి జోరు మీదున్న భారత షట్లరు ఈ టోరీ్నలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. తొలి గేమ్ ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం గేమ్ గెలిచేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. రెండో గేమ్‌లో భారత జోడీ 3–6తో కాస్త వెనుకపడినట్లు కనిపించింది. అయితే అక్కడి నుంచి సాత్విక్–చిరాగ్‌లిద్దరు తమ షాట్లకు పదునుపెట్టడంతో వరుసగా 6 పాయింట్లు గెలిచారు. అక్కడి నుంచి ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయారు. ఇటీవలే ‘యోనెక్స్’ ఫ్యాక్టరీలో ల్యాబ్‌లో ఫాస్టెస్ట్ స్మాష్‌తో గిన్నిస్ రికార్డు నమోదు చేసిన సాత్విక్ సాయిరాజ్ కోర్టులోనూ ఈ సారి అలాంటి ఫీట్‌ను మళ్లీ సాధించడం విశేషం. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ రికార్డు వేగంతో స్మాష్ బాదాడు. అతను కొట్టిన స్మాష్‌కు షటిల్ గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందుకు...
యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–17, 21–15తో ప్రపంచ 16వ ర్యాంక్ జోడీ హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా)పై గెలిచింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్‌లకు తొలి గేమ్‌లో ప్రతిఘటన ఎదురైంది. పలుమార్లు ఆధిక్యం దోబూచులాడింది. 11–12తో వెనుకబడిన దశలో భారత జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి 14–12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్‌లో సాత్విక్, చిరాగ్ ఆరంభంలోనే వరుసగా మూడు పాయింట్లు నెగ్గి శుభారంభం చేసింది. స్కోరు 10–8 వద్ద భారత జోడీ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14–8తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 11–21, 14–21తో రెండో సీడ్ బేక్ హా నా–లీ సో హీ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 15–21, 12–21తో ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రపంచ 32వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 15–21, 21–19, 18–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యిక్ (హాంకాంగ్) చేతిలో... ప్రియాన్షు 14–21, 21–18, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
Korea Open 2022: సెమీఫైనల్లో సాకేత్–యూకీ జోడీ
కొరియా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని పురుషుల డబుల్స్‌లో సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రి జోడీ 6–3, 6–4తో రోడ్రిగ్వెజ్ (కొలంబియా)–డీగో హిడాల్గొ (ఈక్వెడార్) జంటపై గెలుపొందింది. నేడు జరిగే సెమీఫైనల్లో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)– నాథనిల్ లమన్స్ (అమెరికా) జోడీతో భారత ద్వయం పోటీపడుతుంది. మరో వైపు ఇజ్రాయెల్‌లో జరుగుతున్న టెల్ అవీవ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్‌లో బోపన్న–మిడిల్‌కూప్ జంట 4–6, 7–6(7/5), 10–5తో ఫ్రాంకో స్కుగొర్ (క్రొయేషియా)–డెనిస్ మొల్చనొవ్ (ఉక్రెయిన్) ద్వయంపై గెలిచింది. సెమీస్‌లో బోపన్న జోడీ... ఫ్రాన్స్‌కు చెందిన ఫాబియన్ రిబొల్–సాడియో డంబియా జంటతో తలపడుతుంది. చదవండి: Sachin Tendulkar: బ్రెట్ లీ బౌలింగ్‌లో ట్రేడ్‌మార్క్ షాట్.. ఎన్నాళ్లయిందో -
సింధు, శ్రీకాంత్‌లకు కాంస్యం.. వ్రిత్తికి రజతం.. ఇంకా...
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 14–21, 17–21తో ఆన్ సెయంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 19–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. సెమీఫైనల్లో ఓడిన సింధు, శ్రీకాంత్‌లకు 5,220 డాలర్ల (రూ. 3 లక్షల 96 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. ఇతర క్రీడా వార్తలు.. వ్రిత్తి అగర్వాల్‌కు రజతం సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజతం పతకం సాధించింది. అండర్–16 బాలికల ఫ్రీస్టయిల్ 1500 మీటర్ల విభాగం ఫైనల్ రేసును వ్రిత్తి 18 నిమిషాల 06.40 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ‘షూటౌట్’లో భారత్ ఓటమి భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య మహిళల ప్రొ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సవిత కెప్టెన్సీలోని భారత జట్టు ‘షూటౌట్’లో 1–3తో ఓడిపోయింది. ఆట తొలి నిమిషంలో రజ్విందర్ కౌర్ గోల్‌తో భారత్ ఖాతా తెరువగా... 53వ నిమిషంలో కెప్టెన్ జాన్సెన్ యిబ్బి గోల్‌తో నెదర్లాండ్స్ స్కోరును 1–1తో సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున నవనీత్ కౌర్ మాత్రమే సఫలంకాగా రజ్విందర్, నేహా, జ్యోతి విఫలమయ్యారు. నెదర్లాండ్స్ జట్టు తరఫున మరాంటె, ఫోర్టిన్ కిరా, జాన్సెన్ సఫలంకాగా... ఫియోనా విఫలమైంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్ అయినా గెలవండిరా బాబూ! సిగ్గుతో చచ్చిపోతున్నాం! -
పీవీ సింధుకు నిరాశ.. టోర్నీ నుంచి అవుట్!
Korea Open 2022: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. దక్షిణా కొరియాకు చెందిన అన్ సియోంగ్ చేతిలో సింధు సెమీ ఫైనల్లో ఓటమి పాలైంది. పామా స్టేడియం వేదికగా శనివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సియోంగ్ ఆది నుంచి దూకుడైన ఆటతో ముందుకు సాగింది. తొలి గేమ్‌లో అయితే సింధుకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. ఇక వరుస గేమ్‌లలో ఆధిపత్యం కనబరిచిన సియోంగ్ 21-14, 21-17తో సింధును ఓడించింది. దీంతో తెలుగు తేజం సింధు నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. 20 ఏళ్ల సియోంగ్ ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. కాగా అంతకుముందు.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్ (థాయ్‌లాండ్)ను ఓడించిన సంగతి తెలిసిందే. బుసానన్‌పై 17వ సారి విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. కానీ.. సెమీ ఫైనల్లో మాత్రం విజయయాత్రను కొనసాగించలేకపోయింది. ఆరంభం నుంచే వెనుకబడ్డ సింధు చివరికి ఓటమి పాలైంది. An Seyoung goes to the Korea Open 2022 finals by defeating Pusarla V. Sindhu!!!!! What a game!🔥🔥😭#KoreaOpen2022 pic.twitter.com/fwluApklwQ — willie (@willeyhhfixeu) April 9, 2022 -
Korea Open: సింధు, శ్రీకాంత్ జోరు
సన్‌చెయోన్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 17వ విజయం కావడం విశేషం. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–12, 18–21, 21–12తో సన్ వాన్ హో (కొరియా) పై గెలిచాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీ 20–22, 21–18, 20–22తో కాంగ్ మిన్‌హుక్–సియో సెయుంగ్‌జె (కొరియా) జంట చేతిలో... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 19–21, 17–21తో ఎమ్ హై వన్–బో రియోంగ్ కిమ్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయాయి. -
Korea Open: అదరగొట్టిన సింధు, శ్రీకాంత్
సన్‌చెయోన్: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్ కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సత్తా చాటుతున్నారు. వీరిద్దరు అలవోక విజయాలతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే రైజింగ్ స్టార్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రన్నరప్ లక్ష్యసేన్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. డబుల్స్‌లో ఒక్క సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ తప్ప అంతా ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–15, 21–10తో అయ ఒహొరి (జపాన్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో మాల్విక బన్సోద్ 8–21, 14–21తో ఆరోసీడ్ పొర్న్‌పవీ చొచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–18, 21–6తో మిశా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. ఆరో సీడ్ లక్ష్యసేన్ 20–22, 9–21తో షెసర్ హిరెన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి–అశ్విన్ పొన్నప్ప జంట 20–22, 21–18, 14–21తో ఐదో సీడ్ ఒయు జువాన్ యి–హువాంగ్ య కియంగ్ (చైనా) ద్వయంతో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–15, 21–19తో హి యాంగ్–లో కియాన్ హీన్ (సింగపూర్) జంటపై గెలుపొందగా, రెండో సీడ్ మొహమ్మద్ అసాన్–హెండ్రా సెతియాన్ (ఇండోనేసియా)తో జరిగిన పోరులో అర్జున్–ధ్రువ్ కపిల 8–5 స్కోరు వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగారు. చదవండి: IPL 2022: 150 కిమీ వేగంతో బంతి.. కళ్లు చెదిరే సిక్స్; డికాక్ ఊహించి ఉండడు -
మరో నాలుగు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
టోక్యో: కరోనా ఖాతాలో మరో నాలుగు టోర్నీలు చేరాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం తాజాగా ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తైపీ ఓపెన్ (సెప్టెంబర్ 1–6), కొరియా ఓపెన్ (8–13), చైనా ఓపెన్ (15–20), జపాన్ ఓపెన్ (22–27)లను నిర్వహించబోమని సమాఖ్య వెల్లడించింది. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ అందరి ఆరోగ్యభద్రత దృష్ట్యా టోర్నీల రద్దుకే మొగ్గుచూపామని బీడబ్ల్యూఎఫ్ కార్యదర్శి థామస్ లుండ్ పేర్కొన్నారు. ఈ మహమ్మారి కారణంగానే ఇటీవల చైనాలో జరగాల్సిన 11 టెన్నిస్ టోర్నీలు రద్దు కాగా... మంగళవారం ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీఏ పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ తొలిసారిగా రద్దయింది. -
క్వార్టర్స్‌లో పారుపల్లి కశ్యప్
ఇంచియోన్ (దక్షిణ కొరియా): బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్లో భాగంగా కొరియా ఓపెన్‌లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో కశ్యప్ 21-17, 11-21, 21-12 తేడాతో లూయీ డారెన్ (మలేసియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన కశ్యప్.. రెండో గేమ్‌లో దారుణంగా ఓటమి పాలయ్యాడు. రెండో గేమ్‌లో డారెన్ సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్‌లతో ఆకట్టుకోవడంతో కశ్యప్ ఆ గేమ్‌ను చేజార్చుకున్నాడు. ఆపై తిరిగి పుంజుకున్న కశ్యప్.. డారెన్‌ను చిత్తు చేశాడు. ఎక్కడ కూడా ఒత్తిడికి లోనుకాకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. 56 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ తన అత్యుత్తమ గేమ్‌ను బయటకు తీశాడు. ఫలితంగా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఇప్పటికే పలువురు కొరియా ఓపెన్ నుంచి నిష్క్రమించడంతో కశ్యప్‌పైనే భారత్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. -
పీవీ సింధుకు మరో షాక్..
ఇంచియోన్ (దక్షిణ కొరియా): ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత షట్లర్లు.. వరుసగా చైనా, కొరియా టోర్నీలలో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. తాజాగా కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500టోర్నీలో ప్రపంచ చాంపియన్ భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అనూహ్య పరాజయం చవిచూసింది. గతవారం చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిన సింధు బుధవారం జరిగిన కొరియా ఓపెన్ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసింది. తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌పై 7-21, 24-22, 21-15 తేడాతో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్‌లో బీవెన్ జాంగ్‌పై సునాయసంగా గెలిచిన సింధు నేటి మ్యాచ్‌లో మాత్రం తడబడింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ కూడా కొరియా ఓపెన్‌లో ఇంటిదారి పట్టాడు. డెన్మార్క్‌కు చెందిన ఆంటోన్సెన్తో మ్యాచ్‌లో తొలి రౌండ్లో ఓడిపోయిన ప్రణీత్.. రెండో రౌండ్లో గాయపడ్డాడు. దీంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతొ కొరియా ఓపెన్‌లో సింధు, సాయి ప్రణీత్‌ల ప్రయాణం ముగిసింది. ఇక మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పైనే ఆశలు ఉన్నాయి. -
తొలి రౌండ్లోనే కశ్యప్ ఓటమి
గ్వాంగ్జూ (కొరియా): వరల్డ్ టూర్ సూపర్–300 కొరియా ఓపెన్‌లో భారత షట్లర్లకు చుక్కెదురైంది. స్టార్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 17–21, 21–13, 8–21 లీ డాంగ్ క్యూన్ (కొరియా) చేతిలో... సౌరభ్ వర్మ 13–21, 21–12, 18–21తో ఈటూ హియానో (ఫిన్లాండ్) చేతిలో ఓడారు. గంటా 19 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో కశ్యప్ తొలి రెండు గేమ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసినా... మూడో గేమ్‌లో పూర్తిగా తడబడి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయాడు. -
క్వార్టర్స్‌లో సైనా
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ సైనా 21–18, 21–18తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)పై గెలుపొందింది. 37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో కొన్ని సార్లు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా... చివరి వరకు పట్టు సడలించకుండా ఆడిన సైనా విజయం సొంతం చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్)తో సైనా తలపడనుంది. -
ప్రిక్వార్టర్స్‌లో సైనా
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21–12, 21–11తో కిమ్ హయో మిన్ (దక్షిణ కొరియా)పై అలవోకగా గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో కొరియాకే చెందిన కిమ్ గా యున్‌తో సైనా ఆడుతుంది. మరోవైపు భారత్‌కే చెందిన జక్కా వైష్ణవి రెడ్డి, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. తెలుగమ్మాయి వైష్ణవి రెడ్డి 10–21, 9–21తో ఆరో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోగా... సమీర్ వర్మ 21–15, 16–21, 7–21తో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. -
జయరామ్‌కు నిరాశ
సియెల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వాలిఫయింగ్ విభాగంలో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. బరిలో దిగిన ముగ్గురూ తొలి రౌండ్లోనే ఓడి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అజయ్ జయరామ్ 26–24, 21–18తో జావో జున్‌పెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వైదేహి 8–21, 8–21తో కిమ్ గా యున్ (కొరియా) చేతిలో... ముగ్ధ ఆగ్రే 8–21, 8–21తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సైనా సత్తాకు పరీక్ష
సియోల్: ఈ ఏడాది లోటుగా ఉన్న బీడబ్ల్యూఎఫ్ టూర్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొరియా ఓపెన్‌కు సిద్ధమైంది. మంగళవారం మొదలయ్యే ఈ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సైనా ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. మంగళవారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల తర్వాత బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. తొలి రౌండ్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ కిమ్ హయో మిన్తో సైనా ఆడనుంది. తొలి అడ్డంకిని అధిగమిస్తే సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిగా క్వాలిఫయర్ ఎదురుకానుంది. ఈ మ్యాచ్‌లోనూ సైనా గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిగా ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారా (జపాన్) సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. -
సింధు జోరు...
►కొరియా ఓపెన్ సెమీస్‌లోకి భారత స్టార్ ►క్వార్టర్స్‌లో మితానిపై గెలుపు ►నేడు చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో పోరు ►సెమీఫైనల్స్ ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం సియోల్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు 21–19, 16–21, 21–10తో ప్రపంచ 19వ ర్యాంకర్ మినత్సు మితాని (జపాన్)పై కష్టపడి గెలిచింది. రెండో రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించిన మినత్సు అదే జోరును సింధుపై కనబర్చలేకపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే లభించింది. రెండో గేమ్‌లో తడబడిన ఈ తెలుగు తేజం నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం చెలరేగిపోయింది. ఆరంభంలోనే వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచిన సింధు 9–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించిన సింధు గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఆరో సీడ్ హి బింగ్జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3–5తో వెనుకబడి ఉంది. మరో సెమీఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్)తో అకానె యామగుచి (జపాన్) ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ... డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 22–20, 10–21, 13–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సమీర్ తొలి గేమ్‌ను గెలిచినా... ఆ తర్వాత డీలా పడ్డాడు. ఈ గెలుపుతో ఈ ఏడాది ఇండియా ఓపెన్‌లో సమీర్ వర్మ చేతిలో ఎదురైన పరాజయానికి సన్ వాన్ హో బదులు తీర్చుకున్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ –చిరాగ్ ద్వయం 14–21, 21–17, 21–15తో మూడో సీడ్ తకెషి కముర–కిగో సొనోడా (జపాన్) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. -
ఫేవరెట్‌గా సింధు
∙ నేటి నుంచి కొరియా ఓపెన్ ∙ సైనా, శ్రీకాంత్ గైర్హాజరు సియోల్: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్, భారత స్టార్ పూసర్ల వెంకట సింధు కొరియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నేటి నుంచి జరిగే ఈ ఈవెంట్లో ఆమెకు ఐదో సీడింగ్ దక్కింది. తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల సింగిల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్ పోరులో హైదరాబాదీ టాప్ స్టార్ చెంగ్ ఎన్గన్ యి (హాంకాంగ్)తో తలపడనుంది. ఈ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తప్పుకున్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ కోసం వీళ్లిద్దరు ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో సన్నద్ధమవుతున్నారు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఎన్గ్ క లాంగ్ అంగస్ (హాంకాంగ్)తో పోటీపడనున్నాడు. సింగపూర్ ఓపెన్ చాంపియన్ భమిడిపాటి సాయిప్రణీత్ కూడా హాంకాంగ్‌కే చెందిన హు యున్‌తో తలపడతాడు. మిగతా మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ... తనోంగ్సక్ సాన్సోంబూన్సుక్ (థాయ్‌లాండ్)తో, సౌరభ్ వర్మ క్వాలిఫయర్‌తో ఆడనున్నారు. నేడు జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో లిన్ యు సియెన్ (చైనీస్ తైపీ)తో పారుపల్లి కశ్యప్ తలపడతాడు. డబుల్స్ క్వాలిఫయింగ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం... జాంగ్ వూ చొ–హూ తే కిమ్ (కొరియా) జంటతో పోటీపడనుంది. -
క్వార్టర్స్‌లో జయరామ్ పరాజయం
సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకై క భారత ప్లేయర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గత ఏడాది రన్నరప్ జయరామ్ 23-25, 13-21తో లీ హున్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో ఒకదశలో జయరామ్ 14-11తో మూడు పాయి0ట్ల ఆధిక్యంలో ఉన్నాడు. కానీ లీ హున్ వెంటనే తేరుకొని స్కోరును సమం చేయడంతోపాటు 20-17తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో గేమ్‌లో లీ హున్ పూర్తి ఆధిపత్యం చలాయి0చి జయరామ్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. -
క్వార్టర్ ఫైనల్లో జయరామ్
సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ ఆటగాడు అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతను వరుస సెట్లలో చైనాకు చెందిన హువాంగ్ యుగ్జింగ్ను కంగుతినిపించాడు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో జయరామ్ 21-15, 21-18తో గెలిచి... గతేడాది కెనడా ఓపెన్‌లో అతని చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు కొరియాకు చెందిన లీ హ్యూన్తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో భమిడిపాటి సాయి ప్రణీత్ 9-21, 15-21తో ఆరో సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో భారత మేటి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ఇదివరకే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. -
శ్రీకాంత్‌కు చుక్కెదురు
సియోల్: రియో ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న రెండో టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 10-21, 24-22, 17-21తో ప్రపంచ 20వ ర్యాంకర్ వోంగ్ కింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తడబడిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో ఒక మ్యాచ్ పాంట్‌ను కాపాడుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 17-16తో ఆధిక్యంలో ఉన్నా వరుసగా ఐదు పాయింట్లు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకున్నాడు. మరోవైపు క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడిన మరో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ 22-20, 10-21, 13-21తో నాలుగో సీడ్ తియాన్ హువీ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్‌ను నెగ్గిన కశ్యప్ ఆ తర్వాత నిలకడగా రాణించడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయిగ్లో మూడు గేమ్‌లపాటు సాగిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన కశ్యప్ అదే ఫలితాన్ని మెయిన్ ‘డ్రా’లో పునరావృతం చేయలేకపోయాడు. ప్రపంచ 39వ ర్యాంకర్ వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో జరిగిన మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 31వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 23-21, 17-21, 15-21తో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తన్వీ లాడ్ 18-21, 21-13, 18-21తో అనా థి మాడ్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత్‌కే చెందిన భమిడిపాటి సాయిప్రణీత్, అజయ్ జయరామ్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో హైదరాబాద్ ఆటగాడు, ప్రపంచ 35వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21-13, 12-21, 21-15తో ప్రపంచ 26వ ర్యాంకర్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించగా... బుధవారం తన 29వ జన్మదినాన్ని జరుపుకున్న ప్రపంచ 18వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 23-21, 21-18తో ప్రపంచ 22వ ర్యాంకర్ జియోన్ హ్యుక్ జిన్ (కొరియా)ను ఓడించాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో సాయిప్రణీత్; హువాంగ్ యుజియాంగ్ (చైనా)తో జయరామ్ తలపడతారు. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్ ఆటగాడు కశ్యప్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం మొదలైన ఈ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో కశ్యప్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. ప్రపంచ 815వ ర్యాంకర్ కో గ్యుంగ్ బో (దక్షిణ కొరియా)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 107వ ర్యాంకర్ కశ్యప్ 15-21, 23-21, 21-19తో గెలుపొందగా... 100వ ర్యాంకర్ పనావిత్ తొంగ్నువామ్ (థాయ్‌లాండ్)తో జరిగిన రెండో రౌండ్లో 15-21, 21-16, 21-15తో విజయం సాధించాడు. కో గ్యుంగ్ బోతో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ రెండో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో నాలుగో సీడ్ తియాన్ హువీ (చైనా)తో కశ్యప్; వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; హావో (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్; హయెక్ జిన్ (కొరియా)తో జయరామ్ ఆడతారు. -
‘టాప్’లోకి జయరామ్?
న్యూఢిల్లీ : గత వారం కొరియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన షట్లర్ అజయ్ జయరామ్‌ను ‘టాప్’ స్కీంలోకి చేర్చాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించనుంది. అంచనాలకు మించి రాణించిన తను ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ మరోసారి టాప్-25కి చేరాడు. ‘జయరామ్ ప్రొఫైల్‌ను సేకరించమని టెక్నికల్ కమిటీకి తెలిపాం. టాప్ స్కీమ్‌లోకి అతడి పేరును చేర్చాలని ప్రతిపాదిస్తాం’ అని బాయ్ అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా తెలిపారు.