సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్ ఆటగాడు కశ్యప్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం మొదలైన ఈ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో కశ్యప్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. ప్రపంచ 815వ ర్యాంకర్ కో గ్యుంగ్ బో (దక్షిణ కొరియా)తో జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 107వ ర్యాంకర్ కశ్యప్ 15-21, 23-21, 21-19తో గెలుపొందగా... 100వ ర్యాంకర్ పనావిత్ తొంగ్‌నువామ్ (థాయ్‌లాండ్)తో జరిగిన రెండో రౌండ్‌లో 15-21, 21-16, 21-15తో విజయం సాధించాడు.
కో గ్యుంగ్ బోతో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ రెండో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్ తియాన్ హువీ (చైనా)తో కశ్యప్; వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; హావో (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్; హయెక్ జిన్ (కొరియా)తో జయరామ్ ఆడతారు.
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
Published Wed, Sep 28 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
Advertisement