సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో వరుసగా ఆరో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) మధ్య గురువారం జరిగిన తొమ్మిదో గేమ్ 54 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరుగుతాయి.
ఇప్పటికి తొమ్మిది గేమ్‌లు పూర్తయ్యాయి. మరో ఐదు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఇద్దరూ 4.5 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. మొదట 7.5 పాయింట్లు సాధించిన ప్లేయర్ విశ్వవిజేతగా నిలుస్తాడు.
32 ఏళ్ల డింగ్ లిరెన్ తొలి గేమ్‌లో గెలుపొందగా... చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ మూడో గేమ్‌లో నెగ్గాడు. మిగతా ఏడు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. నేడు విశ్రాంతి దినం. శనివారం పదో గేమ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment