సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తొమ్మిదో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య బుధవారం జరిగిన 13వ గేమ్ 68 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. తెల్ల పావులతో ఆడిన గుకేశ్ ‘కింగ్ పాన్’ ఓపెనింగ్ తో గేమ్‌ను ప్రారంభించగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లిరెన్ ఫ్రెంచ్ డిఫెన్స్‌తో జవాబు ఇచ్చాడు.
గుకేశ్ కొత్త వ్యూహాలతో చైనా ప్లేయర్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. 68 ఎత్తులు ముగిశాక ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. నిర్ణీత 14 గేముల్లో 13 గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 6.5–6.5తో సమఉజ్జీగా ఉన్నారు. నేడు చివరిదైన 14వ గేమ్ జరుగుతుంది.
ఒకవేళ చివరిదైన 14వ గేమ్ కూడా ‘డ్రా’ అయితే ఇద్దరూ 7–7తో సమంగా నిలుస్తారు. శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment