
సింగపూర్ సిటీ: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో మరో ‘డ్రా’ నమోదైంది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరిగిన ఎనిమిదో గేమ్ 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇద్దరి మధ్య మొత్తం 14 గేమ్‌లు జరుగుతాయి. ఇప్పటికి ఎనిమిది గేమ్‌లు పూర్తయ్యాయి.
ఇద్దరూ 4 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. మొదట 7.5 పాయింట్లు సాధించిన ప్లేయర్ విశ్వవిజేతగా నిలుస్తాడు. 32 ఏళ్ల డింగ్ లిరెన్ తొలి గేమ్‌లో గెలుపొందగా... చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ మూడో గేమ్‌లో నెగ్గాడు. మిగతా ఆరు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. నేడు తొమ్మిదో రౌండ్ గేమ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment