భారత ఆటగాడు దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సమరంలో మరో పోరు సమంగా ముగిసింది. సింగపూర్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఐదో గేమ్ 40 ఎత్తుల తర్వాత ‘డ్రా’ అయింది. ఈ ఫలితం అనంతరం గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ లిరెన్ చెరో 2.5 పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు.
విజేతగా నిలవాలంటే మిగిలిన 9 గేమ్‌లలో మరో 5 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. నల్ల పావులతో ఆడిన లిరెన్ తొలి గేమ్ తరహాలోనే ఫ్రెంచ్ డిఫెన్స్‌తో మొదలు పెట్టాడు. ఆ గేమ్‌లో ఓటమిపాలైన గుకేశ్ ఈ సారి జాగ్రత్త పడ్డాడు. అయితే 23వ ఎత్తు వద్ద గుకేశ్ తప్పుడు ఎత్తు వేసి ఓటమికి ఆస్కారం కల్పించగా...లిరెన్ దానిని గుర్తించలేకపోయాడు. దాంతో గుకేశ్ డ్రాతో గట్టెక్కాడు.
‘నేను చాలా పెద్ద తప్పు చేశానని తర్వాత అర్థమైంది. కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాను. ఇంకా ఈ సమరం సగం కూడా కాలేదు. కాబట్టి నాకూ మంచి అవకాశాలున్నాయని నమ్ముతున్నా’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు. ఇద్దరి మధ్య ఆరో గేమ్ నేడు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment