సింగపూర్ సిటీ: దొమ్మరాజు గుకేశ్ (భారత్), డింగ్ లిరెన్ (చైనా) మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య మంగళవారం జరిగిన ఏడో గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసింది. చాంపియన్‌షిప్ సమరంలో ఇది వరుసగా నాలుగో ‘డ్రా’ కావడం విశేషం.
5 గంటల 22 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 72 ఎత్తుల తర్వాత ఆటను ముగించేందుకు గుకేశ్, లిరెన్ అంగీకరించారు. అయితే కీలక దశలో గెలిచే స్థితిలో నిలిచిన గుకేశ్ దానిని వథా చేసుకోవడం అతడిని నిరాశపరిచే అంశం. తెల్ల పావులతో ఆడిన గుకేశ్ ఓపెనింగ్ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచాడు.
గుకేశ్ 44వ ఎత్తు తర్వాత లిరెన్ ఓటమికి బాట పడినట్లుగా కనిపించింది. అయితే ఈ గెలుపు అవకాశాన్ని వాడుకోలేక గుకేశ్ వేసిన 45వ ఎత్తు లిరెన్ మళ్లీ కోలుకునేలా చేసింది. ఏడు గేమ్‌ల తర్వాత ఇద్దరూ చెరో 3.5 పాయింట్లతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment