భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోరులో ‘డ్రా’ల పరంపర ఆగడం లేదు. శనివారం జరిగిన పదో గేమ్ కూడా సమంగానే ముగిసింది. తొలి గేమ్‌లో లిరెన్, మూడో గేమ్‌లో గుకేశ్ గెలవగా...ఆ తర్వాత ఇది వరుసగా ఏడో ‘డ్రా’ కావడం గమనార్హం.
నల్ల పావులతో ఆడిన గుకేశ్, లిరెన్ కూడా ఎలాంటి దూకుడైన ఎత్తులకు ప్రయతి్నంచలేదు. ఇద్దరూ డిఫెన్స్‌కే ప్రాధాన్యతనివ్వడంతో 36 ఎత్తుల తర్వాత ‘డ్రా’ ఖాయమైంది. పది గేమ్‌లు ముగిసిన తర్వాత గుకేశ్, లిరెన్ చెరో 5 పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు.
ఈ 14 గేమ్‌ల పోరులో ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. మిగిలిన 4 గేమ్‌ల ద్వారా మరో 2.5 పాయింట్లు ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం. నల్లపావులతో ఆడి గేమ్‌ను ‘డ్రా’గా ముగించడం సంతృప్తిగా ఉందన్న గుకేశ్... రాబోయే నాలుగు గేమ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతాయని ఆశిస్తున్నానన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment