
సియెల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వాలిఫయింగ్ విభాగంలో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. బరిలో దిగిన ముగ్గురూ తొలి రౌండ్‌లోనే ఓడి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అజయ్ జయరామ్ 26–24, 21–18తో జావో జున్‌పెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో వైదేహి 8–21, 8–21తో కిమ్ గా యున్ (కొరియా) చేతిలో... ముగ్ధ ఆగ్రే 8–21, 8–21తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు.