
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సైనా 21–12, 21–11తో కిమ్ హయో మిన్ (దక్షిణ కొరియా)పై అలవోకగా గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో కొరియాకే చెందిన కిమ్ గా యున్‌తో సైనా ఆడుతుంది.
మరోవైపు భారత్‌కే చెందిన జక్కా వైష్ణవి రెడ్డి, సమీర్ వర్మ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. తెలుగమ్మాయి వైష్ణవి రెడ్డి 10–21, 9–21తో ఆరో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోగా... సమీర్ వర్మ 21–15, 16–21, 7–21తో ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు.
Comments
Please login to add a commentAdd a comment