టైటిల్ పోరుకు జయరామ్ | Jayaram to the title Fighting | Sakshi
Sakshi News home page

టైటిల్ పోరుకు జయరామ్

Published Sun, Oct 16 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

టైటిల్ పోరుకు జయరామ్

టైటిల్ పోరుకు జయరామ్

అల్మెరె (నెదర్లాండ్‌‌స): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అజయ్ జయరామ్ డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ జయరామ్ 21-18, 13-21, 21-13తో ఆండ్రెస్ అంటోన్‌సెన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. ఎమిల్ హోల్స్‌ట్ (డెన్మార్క్)-జు వీ వాంగ్ (చైనీస్ తైపీ) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో జయరామ్ తలపడతాడు.

2014, 2015లలో ఈ టైటిల్ నెగ్గిన జయరామ్ ఈసారీ గెలిస్తే ‘హ్యాట్రిక్’ సాధిస్తాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మారుు సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జంట పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ ద్వయం 19-21, 16-21తో సోరెన్ గ్రావోల్ట్- మైకెన్ ప్రుయెర్‌గార్డ్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడిపోరుుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement