ఇంచియోన్ (దక్షిణ కొరియా): బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్‌లో భాగంగా కొరియా ఓపెన్‌లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో కశ్యప్ 21-17, 11-21, 21-12 తేడాతో లూయీ డారెన్ (మలేసియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన కశ్యప్.. రెండో గేమ్‌లో దారుణంగా ఓటమి పాలయ్యాడు. రెండో గేమ్‌లో డారెన్ సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్‌లతో ఆకట్టుకోవడంతో కశ్యప్ ఆ గేమ్‌ను చేజార్చుకున్నాడు.
ఆపై తిరిగి పుంజుకున్న కశ్యప్.. డారెన్‌ను చిత్తు చేశాడు. ఎక్కడ కూడా ఒత్తిడికి లోనుకాకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. 56 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ తన అత్యుత్తమ గేమ్‌ను బయటకు తీశాడు. ఫలితంగా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఇప్పటికే పలువురు కొరియా ఓపెన్ నుంచి నిష్క్రమించడంతో కశ్యప్‌పైనే భారత్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment