
సియోల్: ఈ ఏడాది లోటుగా ఉన్న బీడబ్ల్యూఎఫ్ టూర్ సింగిల్స్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొరియా ఓపెన్‌కు సిద్ధమైంది. మంగళవారం మొదలయ్యే ఈ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్‌లో సైనా ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. మంగళవారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల తర్వాత బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.
తొలి రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ కిమ్ హయో మిన్‌తో సైనా ఆడనుంది. తొలి అడ్డంకిని అధిగమిస్తే సైనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిగా క్వాలిఫయర్ ఎదురుకానుంది. ఈ మ్యాచ్‌లోనూ సైనా గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిగా ప్రపంచ మాజీ చాంపియన్ ఒకుహారా (జపాన్) సిద్ధంగా ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment