క్వార్టర్ ఫైనల్లో జయరామ్ | Ajay Jayaram reaches quarterfinal of Korea Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో జయరామ్

Published Thu, Sep 29 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

క్వార్టర్ ఫైనల్లో జయరామ్

క్వార్టర్ ఫైనల్లో జయరామ్

సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ ఆటగాడు అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతను వరుస సెట్లలో చైనాకు చెందిన హువాంగ్ యుగ్జింగ్‌ను కంగుతినిపించాడు. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో జయరామ్ 21-15, 21-18తో గెలిచి... గతేడాది కెనడా ఓపెన్‌లో అతని చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు.
 
  శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు కొరియాకు చెందిన లీ హ్యూన్‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో భమిడిపాటి సాయి ప్రణీత్ 9-21, 15-21తో ఆరో సీడ్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో భారత మేటి ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ఇదివరకే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement