
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ సైనా 21–18, 21–18తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)పై గెలుపొందింది.
37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో కొన్ని సార్లు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా... చివరి వరకు పట్టు సడలించకుండా ఆడిన సైనా విజయం సొంతం చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్)తో సైనా తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment