నగరంలోని ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థిని సింధు గత అర్థరాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
నగరంలోని ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థిని సింధు (20) గత అర్థరాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో తోటి విద్యార్థులు వెంటనే స్పందించిన కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుతున్న సింధు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. సింధు ఆత్మహత్య గల కారణాలను ఆన్వేషించేందుకు పోలీసులు తోటి విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. సింధు ఆత్మహత్యపై ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అలాగే సింధు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.