దానికి ఆండ్రియా కారణం కాదు... | andrea is not reason for missing a chance in a malayalam movie : shreya saran | Sakshi
Sakshi News home page

దానికి ఆండ్రియా కారణం కాదు...

Published Tue, Dec 10 2013 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

దానికి ఆండ్రియా కారణం కాదు...

దానికి ఆండ్రియా కారణం కాదు...

 టాలీవుడ్, కోలీవుడ్ పక్కన పెట్టేయడంతో మలయాళం, కన్నడ చిత్రాలవైపు దృష్టిని సారించారు శ్రీయ. ఇటీవలే ఓ మలయాళ చిత్రానికి ఆమె సైన్ చేశారు కూడా. ప్రకాశం పరత్తున్నా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లబోతోంది. అయితే... ఈ సినిమా నుంచి శ్రీయ ఉన్నట్టుండి తప్పుకున్నారు. రాకరాక వచ్చిన అవకాశాన్ని శ్రీయ వదులుకోవడం మల్లూవుడ్‌లో చర్చనీయాంశమైంది. అయితే... ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా తమిళ నటి ఆండ్రియాను తీసుకోవడం వల్లే శ్రీయ ఈ సినిమాను వదులుకున్నట్లు కొత్త వార్త ప్రచారంలోకొచ్చింది. గతంలో ఓ తమిళ సినిమా విషయంలో శ్రీయ, ఆండ్రియాకు పెద్ద గొడవే జరిగిందట. అలాంటి ఆండ్రియాతో తెరను పంచుకోవడం ఇష్టం లేకే శ్రీయ ఈ సినిమాను వదులుకున్నారని మలయాళ పరిశ్రమలో అనుకుంటున్నారు. ఈ వార్తను శ్రీయ ఖండించారు. ఆ సినిమా వదులుకోవడానికి వ్యక్తిగత కారణాలే కారణమని, అంతేతప్ప ఆండ్రియా చేస్తున్న కారణంగా ఆ సినిమాను వదులుకున్నాననడం కరెక్ట్ కదని చెప్పారు శ్రీయ. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement