మిర్యాలగూడ పరువు హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే చర్చే. ప్రణయ్ అమృతల ప్రేమ వ్యవహారం, అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అయితే ఈ పరువు హత్యపై సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు.
తాజాగా ‘వీర భోగ వసంతరాయలు’ సినిమాల్లోంచి మొదటి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్‌ను ప్రేమకోసం బలైన వారికి అంకితమిస్తున్నామని, తాజాగా జరిగిన ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌కు ఈ పాటను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment