లేడీస్ టైలర్ రోజులు గుర్తొచ్చాయి - తనికెళ్ల భరణి | Surya vs Surya Platinum Disc Function | Sakshi
Sakshi News home page

లేడీస్ టైలర్ రోజులు గుర్తొచ్చాయి - తనికెళ్ల భరణి

Published Tue, Mar 17 2015 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

లేడీస్ టైలర్ రోజులు గుర్తొచ్చాయి - తనికెళ్ల భరణి

లేడీస్ టైలర్ రోజులు గుర్తొచ్చాయి - తనికెళ్ల భరణి

అప్పట్లో ‘లేడీస్ టైలర్’ పెద్ద హిట్టయింది. దానికీ మేమంతా ఓ టీమ్‌లా కలసి మెలసి పనిచేశాం. ‘సూర్య వెర్సస్ సూర్య’ టీమ్‌తో వర్క్ చేస్తుంటే నాకా రోజులు గుర్తొచ్చాయి’’ అని తనికెళ్ల భరణి అన్నారు. నిఖిల్, త్రిధా చౌధురి జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ ప్లాటినమ్ డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. నిఖిల్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా పదకొండు రోజులకు పదకొండు కోట్లు వసూలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. విభిన్న నేపథ్యంలో చేసిన మా ప్రయత్నం ఇంత ఘన విజయం సాధించడానికి ప్రేక్షకులు కారణమని నిర్మాతలు చెప్పారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, రచయిత చందు మొండేటి, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement