సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా | Manchu Manoj to team up with Dasarath | Sakshi

సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా

Published Mon, Feb 15 2016 10:34 PM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా

సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా

ఇటీవల విడుదలైన మా చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటల విజయం సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ పెంచింది.

 - మంచు మనోజ్
  ‘‘ఇటీవల విడుదలైన మా చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటల విజయం సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ పెంచింది. కొత్తవాడైనా వేద మంచి పాటలు ఇచ్చాడు. త్వరలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ చేయనున్నాం. బ్యాక్ గౌండ్ స్కోర్ కూడా బాగా చేశాడు. దశరథ్ స్టోరీ చెప్పినప్పుడు ఒకే సిట్టింగ్‌లో ఓకే చెప్పేశా’’ అని హీరో మంచు మనోజ్  తెలిపారు. మనోజ్, రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మించిన ‘శౌర్య’ ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది.

దర్శకుడు మాట్లాడుతూ - ‘‘శివకుమార్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రం నిర్మించారు. పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 4న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అవుట్‌పుట్ బాగా వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఫ్యాన్సీ రేట్లకు సినిమా కొన్నారు. అందరికీ లాభాలు రావాలని ఆశిస్తున్నా’’ అని నిర్మాత పేర్కొన్నారు. వరికుప్పల యాదగిరి, వేద, ప్రభాస్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement