ఇది నా ప్రేమకథ! | Idi Naa Love Story Movie First Look Launch | Sakshi
Sakshi News home page

ఇది నా ప్రేమకథ!

Published Sun, Aug 21 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

ఇది నా ప్రేమకథ!

ఇది నా ప్రేమకథ!

 లవర్‌బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’. ఓవియా కథానాయిక. అభిరామ్ సమర్పణలో రమేష్ గోపి దర్శకత్వంలో ఎస్‌వీ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘మూడు పాత్రల్లో తరుణ్ కనిపిస్తారు. నటనపరంగా ఈ మూడు పాత్రలకు తరుణ్ వ్యత్యాసం చూపించడం హైలైట్‌గా నిలుస్తుంది.

లడక్, కులుమనాలిలో తీసిన పాటలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. ఏఆర్ రెహమాన్ శిష్యుడు శ్రీనాథ్ విజయ్‌ని సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్వాలిటీ, ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. సెప్టెంబరులో పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement