గెలుపు కోసమే ఈ యుద్ధం | tarun new flick is yudham | Sakshi
Sakshi News home page

గెలుపు కోసమే ఈ యుద్ధం

Published Mon, Jan 6 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

గెలుపు కోసమే ఈ  యుద్ధం

గెలుపు కోసమే ఈ యుద్ధం

‘‘ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. గెలుపు కోసమే ఇన్ని రోజులు యుద్ధం చేశాం. విజయం సిద్ధిస్తుందని మా నమ్మకం’’ అని తరుణ్ అన్నారు. ఆయన కథానాయకునిగా, స్వర్గీయ శ్రీహరి ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘యుద్ధం’. భారతీగణేశ్ దర్శకత్వంలో నట్టికుమార్ నిర్మించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ- ‘‘దర్శకుడు భారతీగణేశ్ మంచి మాస్ పల్స్ ఉన్న దర్శకుడు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.
 
  తప్పకుండా నా కెరీర్‌లో ఓ మంచి సినిమా అవుతుంది’’అని చెప్పారు. ఈ సందర్భంలో శ్రీహరి లేకపోవడం బాధాకరమని, ఈ చిత్రం తరుణ్‌కి పెద్ద హిట్ కావాలని శ్రీకాంత్ అభిలషించారు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 11న విడుదల చేసి, సంక్రాంతి కానుకగా ఈ నెల 16న సినిమా విడుదల చేస్తామని నట్టికుమార్ తెలిపారు. మాస్ లీడర్‌కీ, యూత్ లీడర్‌కీ మధ్య జరిగిన యుద్ధమే ఈ సినిమా అని దర్శకుడు చెప్పారు. ఇంకా సాధక్ కుమార్, ఘటికాచలం, నట్టి క్రాంతి, జిట్టా సురేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement