
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ షోలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలపై హీరో తరుణ్ స్పందించారు. తాను బిగ్‌బాస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. అసలు షోలో తనకు పార్టిసిపేట్ చేసే ఉద్దేశంగానీ, ఆసక్తి కానీ లేదని వెల్లడించారు. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 2కు ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. జూన్ 10 నుంచి షో ప్రారంభం కానుంది.
వంద రోజులు జరిగే ఈ సీజన్‌లో 16 మంది పార్టిసిపెంట్స్ అలరించబోతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ నుంచి శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే సెలబ్రిటీలకు సంబంధించిన జాబితా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న లిస్ట్ ఇదే!
సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామల, యాంకర్ లాస్య, హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మి, ధన్య బాలకృష్ణ, జూనియర్ శ్రీదేవి, హీరోయిన్ గజాలా, చాందిని చౌదరి, శ్రీరెడ్డి, వరుణ్ సందేశ్, తనీష్, వైవా హర్ష, కమెడియన్ వేణు, ఆర్యన్ రాజేష్
Comments
Please login to add a commentAdd a comment