కుక్క దాడిలో తెగిపోయిన చెంప | The dog had been broken in the attack on the cheek | Sakshi
Sakshi News home page

కుక్క దాడిలో తెగిపోయిన చెంప

Dec 19 2015 12:08 AM | Updated on Sep 3 2017 2:12 PM

కుక్క దాడిలో తెగిపోయిన చెంప

కుక్క దాడిలో తెగిపోయిన చెంప

వీధి కుక్క దాడిలో మూడేళ్ల బాలుడి చెంప ఐదు అంగుళాల మేర తెగిపోయింది.

నల్లకుంట: వీధి కుక్క దాడిలో మూడేళ్ల బాలుడి చెంప ఐదు అంగుళాల మేర  తెగిపోయింది. వివరాలు... మెదక్ జిల్లా చేకుంటకు చెందిన మోహన్ కుమారుడు తరుణ్(3) గురువారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుడగా.. వీధికుక్క దాడి చేసి కుడి వైపు చెంప, కడుపుపై కరిచింది.  చెంప దాదాపు ఐదు అంగుళాల మేర తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది.

కుటుంబసభ్యులు వెంటనే తరుణ్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు కుట్లు వేసి, టీటీ ఇంజక్షన్ ఇచ్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం బాధిత బాలుడిని శుక్రవారం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు రాగా..  వైద్యులు గాయాలను శుభ్రపర్చి రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement