Tarun Mother Roja Ramani Open About Her Son Marriage - Sakshi
Sakshi News home page

త్వరలోనే తరుణ్‌ పెళ్లి..?, ఆసక్తికర విషయాలు వెల్లడించిన రోజా రమణి

May 16 2023 2:15 PM | Updated on May 16 2023 2:34 PM

Tarun Mother Roja Ramani Open About Her Son Marriage - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న నటుల్లో తరుణ్‌ ఒకడు.   మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత పదికి పైగా చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక నువ్వేకావాలి చిత్రంతో స్టార్‌ స్టేటస్‌ని పొందాడు. ఈ మధ్య కాలంలో తరుణ్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు కానీ.. ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలంటే తరుణ్‌ ఉండాల్సిందే. లవర్‌ బాయ్‌గా ఎంతో మందిని అభిమాలను సంపాదించుకున్నాడు. బిజినెస్‌లో బిజీ కావడంతో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చాడు. త్వరలోనే తరుణ్‌ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అలాగే అతని పెళ్లి గురించి కూడా రూమర్స్‌ వచ్చాయి.

(చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ )

తాజాగా వీటిపై తరుణ్‌ తల్లి, నటి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రోజా రమణి స్పందించారు. తరుణ్‌పై వస్తున్న రూమర్స్‌ చూసి చాలా బాధ కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ.. ‘తరుణ్‌ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక వెబ్‌ సిరీస్‌తో పాటు సినిమాను చేయబోతున్నాడు. అయితే వీటిల్లో ఏది ముందు రిలీజ్‌ అవుతుందో చెప్పలేను. అందరి ఆశిస్సులతో తరుణ్‌ కచ్చితంగా మళ్లీ హీరోగా రాణిస్తాడని ఆశిస్తున్నాను’అని రోజా అన్నారు.

(చదవండి: స్టేజీపైనే ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్..)

ఇంకా తరుణ్‌ గురించి చెబుతూ.. ‘తరుణ్‌ రోజు గంటన్నర పాటు పూజలు చేస్తాడు. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడు. నా కంటే భక్తి ఎక్కువ. శని, మంగళవారం నాన్‌ వెజ్‌ తినడు. మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్‌ తింటాడు. ప్రస్తుతం అభిమానుల ఆశిస్సులతో హ్యాపీగా ఉన్నాం. తరుణ్‌ పెళ్లి ఒక్కటి అయితే చాలు. అంతకు మించింది ఏది లేదు. అది ఎలాగో అవుతుంది’అని రోజా చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement