roja ramani
-
దశాబ్ది ఉత్సవాలు: తెలుగు సినిమా, సీరియల్స్ డబ్బింగ్ కళాకారుల సందడి!
హైదరాబాద్: శ్రీ నగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా, సీరియల్స్‌కి సంబంధించిన డబ్బింగ్ కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. DAATT అధ్యక్షుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు మాట్లాడుతూ ఇన్ని గళాలతో కలిసి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, రోజంతా బిజీగా గడిపే మా జీవితాలకు అన్ని పండగలు కలిసి ఓకే రోజు చేసుకున్నట్టుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సీనియర్ నటి రోజా రమణి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వినోద్ బాల, కాదంబరి కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ బంటి , DAATT కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ వర్మ, టీవీ విఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ ఆవిష్కరణ -
ఆ పెద్దమనిషి మాకు భోజనం వడ్డించారు..!
-
ఆ హీరోయిన్ కు నా కొడుకు అంటే ఇష్టం..!
-
నటి రోజా రమణి మాటలో SV రంగారావు..!
-
SV రంగారావుకి మేకప్ ఎన్ని గంటలు వేసేవారంటే..
-
అప్పట్లో SV రంగారావు రెమ్యూనరేషన్ ఎంత?
-
SV రంగారావు ఎవరో నాకు తెలీదు
-
సావిత్రి తో షూటింగ్ తర్వాత ఇంటికి వచ్చి భార్యతో SVR ఏం చెప్పేవారంటే..
-
ఎస్.వి. రంగారావు నాతో ఎలా ఉండేవారంటే..
-
త్వరలోనే తరుణ్ పెళ్లి..?, ఆసక్తికర విషయాలు వెల్లడించిన రోజా రమణి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటుల్లో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత పదికి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఇక నువ్వేకావాలి చిత్రంతో స్టార్ స్టేటస్‌ని పొందాడు. ఈ మధ్య కాలంలో తరుణ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు కానీ.. ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలంటే తరుణ్ ఉండాల్సిందే. లవర్ బాయ్‌గా ఎంతో మందిని అభిమాలను సంపాదించుకున్నాడు. బిజినెస్‌లో బిజీ కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. త్వరలోనే తరుణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అలాగే అతని పెళ్లి గురించి కూడా రూమర్స్ వచ్చాయి. (చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ ) తాజాగా వీటిపై తరుణ్ తల్లి, నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి స్పందించారు. తరుణ్‌పై వస్తున్న రూమర్స్ చూసి చాలా బాధ కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ.. ‘తరుణ్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక వెబ్ సిరీస్‌తో పాటు సినిమాను చేయబోతున్నాడు. అయితే వీటిల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చెప్పలేను. అందరి ఆశిస్సులతో తరుణ్ కచ్చితంగా మళ్లీ హీరోగా రాణిస్తాడని ఆశిస్తున్నాను’అని రోజా అన్నారు. (చదవండి: స్టేజీపైనే ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్..) ఇంకా తరుణ్ గురించి చెబుతూ.. ‘తరుణ్ రోజు గంటన్నర పాటు పూజలు చేస్తాడు. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడు. నా కంటే భక్తి ఎక్కువ. శని, మంగళవారం నాన్ వెజ్ తినడు. మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్ తింటాడు. ప్రస్తుతం అభిమానుల ఆశిస్సులతో హ్యాపీగా ఉన్నాం. తరుణ్ పెళ్లి ఒక్కటి అయితే చాలు. అంతకు మించింది ఏది లేదు. అది ఎలాగో అవుతుంది’అని రోజా చెప్పుకొచ్చారు. -
అందరి ముందు ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు!: రోజా రమణి
నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్రసీమలో రాణించింది రోజా రమణి. బాలనటిగా భక్తప్రహ్లాదతో అబ్బురపరిచిన ఆమె ఆ తర్వాతి కాలంలో హీరోయిన్‌గానూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్గా బిజీ అవుతున్న సమయంలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. తెలుగు హిట్స్ అయిన ఆడపడుచు, లవకుశ, సతీ అనసూయ ఒరియా రీమేకుల్లో హీరో చక్రపాణితో కలిసి నటించింది రోజా రమణి. వీరిద్దరూ కలిసి నటించిన కవి సామ్రాట్ ఉపేంద్ర బంజు అక్కడ పెద్ద హిట్. వీరి స్నేహం ప్రేమగా మారడం, దాన్ని పెద్దలు ఆశీర్వదించడంతో పెళ్లి జరిగిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు తరుణ్ హీరోగా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన కొంతకాలం వరకు కుటుంబానికే పెద్ద పీట వేస్తూ సినిమాలకు దూరమైంది రోజా రమణి. నటించడం మానేసినా 1984 నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారి స్క్రీన్‌పై తన గొంతు పలికించింది. దాదాపు 300 మంది హీరోయిన్లకు గాత్రదానం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు నందమూరి తారక రామారావు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నందమూరి తారకరామావు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో నటించడం నా అదృష్టం. ఆయనతో మొదటిసారి 'తాతమ్మ కల' చేశాను. ఈ చిత్రంలో ఆయన నటించి, దర్శకత్వం వహించడమే కాక స్వయంగా నిర్మించారు. ఆయనతో నాలుగైదు సినిమాలు చేశాను. డ్రైవర్ రాముడు సినిమాలో ఏమని వర్ణించను.. పాట చాలా పెద్ద హిట్. ఈ సినిమాలో నేను కళ్లు లేని అమ్మాయిగా, ఆయనకు చెల్లిగా నటించాను. ఆ పాట చివర్లో నేను చిన్న బిట్ పాడుతూ ఎన్టీఆర్ కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉండిపోయాను. డైరెక్టర్ రాఘవేంద్రరావు మమ్మల్ని చూసి ఎమోషనలై కట్ చెప్పకుండా సీన్లో లీనమైపోయారు. ఓ సంఘటన నాకింకా గుర్తుంది. విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద షూటింగ్ జరుగుతోంది.. సూసైడ్ చేసుకోవడానికి పరుగెత్తుతున్నాను. నా వెనకాల హరికృష్ణ గారు ఆగు, చెల్లెమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నడిరోడ్డు మీద ఎన్టీ రామారావు డైరెక్షన్ చేస్తున్నారు. వేలాదిమంది జనం గుమిగూడి షూటింగ్ చూస్తున్నారు. నేను బ్యారేజీ రెయిలింగ్ దగ్గర కాస్త హైట్ కోసం ఖాళీ క్యాన్ల మీద నిలబడ్డాను. ఆ క్యాన్లు ఊగిపోతుండటంతో రామారావు వెంటనే వచ్చి నేను పడిపోకుండా నా కాళ్లు పట్టుకుని యాక్ట్ చేయమన్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నా నిజంగా అక్కడ సూసైడ్ జరుగుతుందని ఆయన భయపడ్డారు. అందుకే ఆయనే స్వయంగా వచ్చి వేలాది మంది జనం ముందు ఏమాత్రం ఆలోచించకుండా కాళ్లు పట్టుకున్నారు. ఆయన చేసిన పనికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది రోజా రమణి. చదవండి: ఆ హీరోతో డేటింగ్.. మరో హీరోతో లవ్ అంటూ రూమర్స్.. ఎట్టకేలకు క్లారిటీ ఆ ఓటీటీలోకి రానున్న ఏజెంట్.. -
రమణీయ వాణి
1967లో బాల నటిగా పాల కడలిపై శేషతల్పమున నట జీవితం ప్రారంభించారు...కథానాయికగా ఏ దివిలో విరిసిన పారిజాతమో అనిపించారు...వయసుకు మించిన పెద్ద పాత్రలో నిన్ను కన్న కథ అంటూ ప్రేక్షకుల కంట తడి పెట్టించారు...వివాహానంతరం 1984 నుంచి అదృశ్యరూపంలో తన గొంతును వందల మంది కథానాయికలలో పలికించారు...గాయని అవుదామనుకున్నారు... కాని అదృశ్యవాణి అయ్యారు...ఆమె అలనాటి నటి శ్రీమతి రోజారమణి...తన అదృశ్య వాణి గురించి సాక్షితో అనేక విషయాలు ముచ్చటించారు...భక్త ప్రహ్లాదలో నటించి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా మీకు ముందుగా సాక్షి తరఫు నుంచి శుభాకాంక్షలు. డబ్బింగ్ ఆర్టిస్టుగా మీ కెరీర్ గురించి.... నా ఐదో ఏట నట జీవితం ప్రారంభించాను. బాలనటిగా, హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేశాను. నేను డైలాగ్ చెప్పే విధానం బాగుంటుందని నాకు మంచి పేరు వచ్చింది. 1981లో వివాహానంతరం కొంతకాలం విరామం తీసుకున్నాను. అప్పట్లో నన్ను డబ్బింగ్ చెప్పమని చాలామంది అడిగారు. నా వాయిస్ వేరే వారికి ఇవ్వడం ఎందుకు అన్న స్వార్థం కొంతకాలం నన్ను డబ్బింగ్‌కు దూరంగా ఉంచింది. కాని ఆ గొంతుతో నన్ను నేను చూసుకోవచ్చు కదా అనుకున్నాను. ఆ సమయంలో అంటే 1984లో మురళీమోహన్ తీస్తున్న ‘నిర్దోషి’ చిత్రంలో ‘హీరోయిన్గా నటిస్తున్న సుహాసినికి డబ్బింగ్ చెప్పమని అడిగారు. ఓకే చెప్పాను. సుహాసినికి నా గొంతు సరిపోవడంతో, నన్ను కొనసాగించారు. అలా నేను సినిమాకు దూరం కాకుండా, కుటుంబం చూసుకుంటూ ఆనందంగా గడిపాను. చివరకు డబ్బింగ్ నా ప్రొఫెషన్ అయిపోయింది. డబ్బింగ్‌తో ఉండే సౌలభ్యం... సినిమా అంటే వందమందితో కలిసి చాలారోజులు పగలు రాత్రి తేడా లేకుండా, ఔట్‌డోర్ షూటింగ్ కూడా చేయాలి. డబ్బింగ్ అంటే ఒకటి రెండు రోజులు చెబితే ఒక సినిమా అయిపోతుంది. కమర్షియల్ అయితే రెండు రోజులు. హీరోయిన్ ఓరియెంటెడ్ అయితే మూడు రోజులు. డబ్బింగ్ విధానం నాడు – నేడు అప్పట్లో డిజిటల్ సిస్టమ్ లేదు కదా. టేప్ చేసిన రికార్డు వినిపించేవారు. సినిమాతో పాటు గొంతు వినిపించదు. ఇప్పుడు విధానం మారిపోయింది. ప్రతి డైలాగ్ చెప్పిన తరవాత ప్లే చేస్తారు. బాగుందో లేదో చూసుకుని, అవసరమైతే మార్చుకుంటాం. అందువల్ల గొంతు సరిపోయిందా లేదా చూసి సరిచేసుకోవచ్చు. మీరు డబ్బింగ్ చెప్పిన చిత్రాలు కథానాయికల వివరాలు... ఇప్పటికి సుమారు 500 చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను. 32 సంవత్సరాల క్రితమే నా కెరీర్ ప్రారంభించాను. 20 సంవత్సరాల పాటు, బిజీగా నంబర్ ఒన్‌గా నిలిచాను. రిపీటెడ్ హీరోయిన్లు 100 మందిని తీసేసినా, మొత్తంగా 350 మంది కథానాయికలకు చెప్పాను. శోభన, రజని, యమున, రోజా, రాధిక, విజయశాంతి, రాధ, భానుప్రియ, రమ్యకృష్ణ, వాణీవిశ్వనాథ్, సౌందర్య, ఉత్తరాది వారికి చాలామందికి చెప్పాను. దివ్యభారుతి, దీప్తి భట్నాగర్, మీనాక్షి శేషాద్రి, మీనా, శిల్పాశెట్టి, ఖుష్బూ... చాలామందికి చెప్పాను. మీనాకు సుమారు పాతిక సినిమాలు చెప్పాను. డబ్బింగ్ ఆర్టిస్టుగా మీ అనుభవాలు... ‘చిన్నకోడలు చిత్రంలో నెల్లూరు యాసలో మాట్లాడినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కో డైరెక్టర్ నెల్లూరుకి చెందినవారు కావడంతో ఆయన చాలా బాగా నేర్పారు. పక్కా తెలుగుదనం ఉన్నా, స్టయిలిష్‌గా ఉన్నా సమస్య ఉండదు. నెల్లూరు, శ్రీకాకుళం, గోదావరి... వంటి యాసలు వచ్చిన ప్పుడు, రెండు మూడు డైలాగులు కష్టపడ్డాక, ఇంక ఇబ్బంది అనిపించదు. గొంతును ప్రొడ్యూస్ చేయడం నాకు చాలా ఇష్టం. అది నా మనసులో ఉండిపోయింది కానీ నేను డబ్బింగ్ చెబుతాననుకోలేదు. నాకు సరైన సమయంలో అవకాశం వచ్చింది. నా మనసులోనిలిచిపోయిన కొన్ని పాత్రలుు... మౌనపోరాటం (యమున),అంకురం (రేవతి), ఊర్మిళ (మాలాశ్రీ),కంటే కూతుర్నే కనాలి (రమ్యకృష్ణ),నిరీక్షణ (అర్చన), అల్లుడుగారు (శోభన),(సీతారామయ్యగారి మనవరాలు(మీనా)... ఇంకా చెప్పాలంటే 30 – 40 వస్తాయి. చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో నగ్మా, రమ్యకృష్ణ, రోజా ముగ్గురికీ చెప్పాను.. రమ్యకృష్ణకి బ్రాహ్మణ భాష, చాలా జాగ్రత్త పడ్డాను∙ ‘చిత్రం భళారే విచిత్రం’ చిత్రంలో నరేశ్‌కి, ‘ఓహోనా పెళ్లంట’ చిత్రంలో హరీష్‌కి చెప్పాను ∙‘కాశ్మోరా’ చిత్రంలో భానుప్రియకు గొంతు ఇచ్చాను. అందులో బాగా గట్టిగట్టిగా, పిచ్చిపిచ్చిగా అరుపులు కేకలు ఉంటాయి. ఆ డైలాగులకు కొంచెం ఇబ్బంది పడ్డాను ∙అన్వేషిత సీరియల్‌కి డబ్బింగ్ చెప్పాను ∙ భానుమతి తీసిన టెలీఫిల్మ్లో నటించాను ∙రేడియోలో మాట్లాడాను ∙కొన్ని ప్రమోషన్ల కోసం చిన్న చిన్న స్కిట్స్ వేసాను. – పురాణపండ వైజయంతి -
నా జనరేషన్లో ఇంతటి అదృష్టం నాదే : రోజారమణి
పోతన పద్యాలను వల్లెవేయడం... ఏనుగుల గుంపుతో కలిసి షికారు చేయడం... మిన్నాగులను పూలదండల్లాగా అలంకరించుకోవడం... ఇలాంటి సాహసాలు ఓ అయిదేళ్ల చిన్నారి చేస్తే... దాన్ని ‘సాహసం’ అనక ఏమంటారు?. పైగా అది ఈ రోజుల్లో కాదు, 47 ఏళ్ల క్రితం. అందుకే... ‘సాహస బాలిక’ అంటే ఇప్పటికీ రోజారమణే గుర్తొస్తారు. భక్తప్రహ్లాదునిగా ఆమె అభినయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. బాలనటిగా, కథానాయికగా, కేరక్టర్ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న రోజారమణి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. అయిదేళ్ల వయసు నుంచీ ఆర్క్‌లైట్ల కాంతులు, నాగరా శబ్దాలు మీ జీవితంలో భాగం అయిపోయాయి. ఇప్పుడేమో సమయమంతా కుటుంబానికే సరిపోతోంది. బాధ అనిపించట్లేదా? ఇది నా అంతట నేను ఇష్టంతో తీసుకున్న నిర్ణయం. నటన, డబ్బింగ్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపాను. కళాకారిణిగా మూడు దశాబ్దాల ప్రయాణం నాది. 150 సినిమాల్లో నటించాను. ఎప్పుడైతే పెళ్లయ్యి పిల్లలు పుట్టారో.. అప్పట్నుంచే నా అంతట నేనే వృత్తికి దూరమవుతూ వచ్చాను. నాకు మొదట్నుంచీ కుటుంబంపై ఆపేక్ష ఎక్కువ. ఏదైనా దగ్గరుండి చూసుకోవడం అలవాటు. అందుకే దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నా ఇంటిని చక్కదిద్దుకోగలిగాను. పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేశాను. ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. సమాసభూయిష్టమైన పోతన పద్యాలకు అంత చిన్న వయసులో చక్కగా లిప్ మూమెంట్ ఇచ్చారు. ఎలా సాధ్యమైంది? అందరూ ఇదే అడుగుతుంటారు(నవ్వుతూ). దానికి నేను చెప్పే సమాధానమొక్కటే. ఆ శ్రీహరే పలికించాడు. ఆ సినిమా టైమ్‌లో ఏదో తెలియని శక్తి నాలో ఆవహించిందనిపిస్తుంది. ఇప్పుడున్నంత సాంకేతిక విలువలు అప్పుడు లేవు. రంగూన్ రామారావుగారని ఓ పెద్దాయన దగ్గరుండి పోతన పద్యాలన్నీ నాకు నేర్పారు. ఒక ఏనుగుపై ఊరేగడం పెద్ద విశేషమేం కాదు. కానీ... ఏనుగుల గుంపుతో కలిసి జర్నీ చేయడం అంటే నిజంగా రిస్క్. ఒక్క ఏనుగు డిస్ట్రబ్ అయినా దారుణాలు జరిగిపోతాయి. కానీ... ధైర్యంగా ఏనుగులతో జర్నీ చేశాను. పాముల్ని మెడలో వేసుకున్నాను. ఇదంతా నారాయణుని చలవే. ఇప్పుడు సినిమా చూసినా... ‘అవన్నీ చేసింది నేనేనా’ అనిపిస్తుంది. పూర్వజన్మ సుకృతం వల్ల లభించిన అద్భుత అవకాశం అది. హీరోయిన్గా ఎక్కువ సినిమాలు చేయలేదెందుకు? నేను కథానాయిక అయిన టైమ్‌లో హీరోలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, హరనాథ్, కృష్ణ, శోభన్‌బాబు. బుక్స్ పట్టుకొని కాలేజీలకు కూడా వీళ్లే వెళ్లేవారు. అలాంటి వారి పక్కన నేనేం సరిపోతాను చెప్పండి? టీనేజ్ లవ్‌స్టోరీలు అప్పటికి రాలేదు. దాంతో సెలక్టివ్‌గా సినిమాలు చేసేదాన్ని. ఓ సీత కథ, భారతంలో అమ్మాయి, ఎవరికివారే యమునాతీరే, కన్నె వయసు, పునాదిరాళ్లు... ఇలా ఉన్నంతలో చెప్పుకోదగ్గ సినిమాలే చేశాను. సరిగ్గా హీరోయిన్గా బిజీ అవుతున్నాననగా పెళ్లయిపోయింది. ఇక సినిమాలు పక్కన పెట్టేశాను. ‘డ్రైవర్‌రాముడు’ లో ఎన్టీఆర్‌కి చెల్లెలుగా చేశారు కదా! ఆ అనుభవాలు? అంతకు ముందే ‘తాతమ్మకల’ సినిమాలో ఆయన కూతురిగా నటించాను. పైగా ఆయనే దర్శకుడు. నా అదృష్టం ఏంటంటే... ఎన్టీఆర్, భానుమతి, కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు లాంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేశాను. నా జనరేషన్లో ఇంతటి అదృష్టం నాదే. ‘సత్తెకాలపు సత్తెయ్య’ సినిమాలో నేను బాలనటిని. చలంగారి కాంబినేషన్ పాత్ర. తర్వాత ఆయనకే జోడీగా ‘లంబాడోళ్ల రాందాసు’లో నటించాను. ఇదంతా దైవకృప. నటుడు చక్రపాణిగారితో మీది ప్రేమ వివాహమా? ప్రేమ వివాహం అనలేం, పెద్దలు కుదిర్చిన పెళ్లీ అనలేం. ఆయన నాకు మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్నప్పటినుంచీ తెలుసు. చక్రపాణిగారు తెలుగువారైనా కాలక్రమంలో ఒరియాలో పెద్ద స్టార్ అయ్యారు. తెలుగు హిట్స్... ఆడపడుచు, లవకుశ, సతీ అనసూయ ఒరియా రీమేకుల్లో హీరోహీరోయిన్లుగా నేను, ఆయనా నటించాం. మేం కలిసి నటించిన ‘కవి సామ్రాట్ ఉపేంద్ర బంజు’ సినిమా అక్కడ పెద్ద హిట్. ఆ ప్రయాణంలో మేం మంచి ఫ్రెండ్స్ అవ్వడం, తర్వాత అది ప్రేమగా మారడం, పెద్దలు ‘పెళ్లి’తో మమ్మల్ని దీవించడం జరిగిపోయింది. సరితా, మీరు పోటాపోటీగా డబ్బింగ్ చెప్పేవారు కదా! నేను ఎవర్నీ పోటీగా తీసుకోను. ఇక్కడ ఎవరి పనులు వారికుంటాయి. దాదాపు 400 సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. 300 మంది హీరోయిన్లకు గాత్రదానం చేశాను. వీరిలో సుహాసిని, మీనా, రమ్యకృష్ణ, రోజా... లాంటి స్టార్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఇప్పుడేమో చిన్న చిన్న పిల్లలు కథానాయికలుగా వచ్చేస్తున్నారు. వారికి డబ్బింగ్ చెప్పాలంటే ఆర్టిఫీషియల్‌గా మాట్లాడాలి. అది నా వల్ల కాదు. అందుకే... ప్రాముఖ్యత ఉన్న పాత్రలకు మాత్రమే డబ్బింగ్ చెబుతున్నాను. మీ అబ్బాయి తరుణ్ సినిమాలకు కథలేమైనా వింటున్నారా? కొత్తలో వినేదాన్ని. ఇప్పుడు వాడి కథలు వాడే వింటున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలకు సంబంధించిన సిట్టింగ్స్ జరుగుతున్నాయి. విజయదశమికి ఆయా సినిమాల ప్రకటన ఉంటుంది. ఇంతకీ తరుణ్ పెళ్లెప్పుడు? మీకు తెలియకుండా జరగదు కదా. అది కూడా త్వరలోనే (నవ్వుతూ). - బుర్రా నరసింహ