
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ కోనా తరుణ్‌కు టైటిల్ దక్కింది. ప్రిటోరియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో తరుణ్–సౌరభ్ శర్మ (భారత్) ద్వయం 21–9, 21–15తో టాప్ సీడ్ ఆతిష్ లూబా–జూలియన్ పాల్ (మారిషస్) జంటపై గెలిచింది.
ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జోడీ 21–12, 21–10తో కొపోలో పాల్–థబారి మాథె (జింబాబ్వే) జంటపై... క్వార్టర్ ఫైనల్లో 21–16, 21–14తో బహాదీన్ అహ్మద్–నాసిర్ (జోర్డాన్) ద్వయం, సెమీఫైనల్లో 15–21, 21–14, 21–13తో ఆదర్శ్ కుమార్–జగదీశ్ యాదవ్ (భారత్) జోడీపై గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment