తరుణ్, సంజనలకు టైటిల్స్ | tarun, sanjana clinch aita titles | Sakshi
Sakshi News home page

తరుణ్, సంజనలకు టైటిల్స్

Published Tue, Sep 20 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

tarun, sanjana clinch aita titles

సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ సిరీస్ టోర్నమెంట్‌లో తరుణ్, సంజన విజేతలుగా నిలిచారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్‌లో సోమవారం జరిగిన అండర్-16 బాలుర ఫైనల్లో తరుణ్ కర్ర (డీఎఫ్) 5-4 (7/3), 4-1తో సాహిల్‌పై గెలుపొందాడు. బాలికల ఫైనల్లో సంజన (డీఎఫ్) 4-2, 5-3తో సుజనను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. మరోవైపు బాలుర డబుల్స్ విభాగంలో తరుణ్- సుహిత్ ద్వయం 7-0, 2-4 (10/3)తో ఆదిత్య-యశోధన్‌పై విజయం సాధించగా... బాలికల విభాగంలో అమూల్య- తనూజ జోడి 7-7 (8-6)తో ఆర్ని రెడ్డి- వేద ప్రపూర్ణ జంటపై నెగ్గి విజేతలుగా నిలిచారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement