AITA championship
-
సంజనకు హ్యాట్రిక్ టైటిల్
హైదరాబాద్: ‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్లలో హైదరాబాద్ క్రీడాకారిణి సంజన సిరిమల్ల నిలకడ విజయాలతో సత్తా చాటుతోంది. కొంపల్లిలోని సురేశ్ కృష్ణ టెన్నిస్ అకాడమీలో జరిగిన అండర్–16 టోర్నీలో సంజన విజేతగా నిలిచింది. ఈనెలలో ఆమెకు ఇది మూడో సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. జూన్ 11 నుంచి 16 వరకు జరిగిన అండర్–18 చాంపియన్‌షిప్ సిరీస్, జూన్ 18 నుంచి 23 వరకు జరిగిన అండర్–16 సూపర్‌సిరీస్ టోర్నీల్లోనూ సంజన విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఈ టోర్నీ అండర్–16 బాలికల సింగిల్స్ ఫైనల్లో సంజన 6–2, 6–4తో రితి అగర్వాల్ (కర్ణాటక)పై గెలుపొందింది. బాలుర విభాగంలో మహారాష్ట్రకు చెందిన ఆర్యన్ భటి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు ఇదే టోర్నీ అండర్–16 బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి అదితి ఆరే టైటిల్‌ను గెలుచుకుంది. టైటిల్‌పోరులో అదితి 6–0, 6–2తో త్రిష్యా ఖండేవాల్ (కర్ణాటక)ను ఓడించింది. -
తరుణ్, సంజనలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ సిరీస్ టోర్నమెంట్లో తరుణ్, సంజన విజేతలుగా నిలిచారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో సోమవారం జరిగిన అండర్-16 బాలుర ఫైనల్లో తరుణ్ కర్ర (డీఎఫ్) 5-4 (7/3), 4-1తో సాహిల్‌పై గెలుపొందాడు. బాలికల ఫైనల్లో సంజన (డీఎఫ్) 4-2, 5-3తో సుజనను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. మరోవైపు బాలుర డబుల్స్ విభాగంలో తరుణ్- సుహిత్ ద్వయం 7-0, 2-4 (10/3)తో ఆదిత్య-యశోధన్పై విజయం సాధించగా... బాలికల విభాగంలో అమూల్య- తనూజ జోడి 7-7 (8-6)తో ఆర్ని రెడ్డి- వేద ప్రపూర్ణ జంటపై నెగ్గి విజేతలుగా నిలిచారు.