మసాయిపేట బస్సు ప్రమాదంలో మరో విద్యార్థి మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. సికింద్రాబాద్ లోని యశోద హస్పిటల్లో ఐదురోజులుగా చికిత్సపొందుతున్న తరుణ్ అనే విద్యార్థి మృతి సోమవారం సాయంత్రం మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ముసాయిపేట వద్ద గురువారం ఉదయం స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతి చెందిన సంగతిత తెలిసిందే.