Yashodha Hospital
-
తన సొంతింటికి కేసీఆర్
-
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పొన్నం
-
కాసేపట్లో యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
-
కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్
-
ఆసుపత్రిలో సీఎం కేసీఆర్.. బండి సంజయ్ స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను యశోద ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా.. ఆస్పత్రిలో కేసీఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ టెస్టులు పూర్తి అయినట్లు, గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవని యశోద వైద్యులు వెల్లడించారు. యాంజియోగ్రామ్ టెస్టులు నార్మల్‌గానే వచ్చాయని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. ఈ సందర్భంలోనే సీఎం కేసీఆర్‌కు ప్రతీ ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం స్టేబుల్‌గా ఉందని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం: సీఎం వ్యక్తిగత డాక్టర్ శ్రీ ఎం.వి.రావు pic.twitter.com/WUxlaFwo7J — Telangana CMO (@TelanganaCMO) March 11, 2022 కేసీఆర్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, రాజకీయాల్లో వీరిద్దరూ బద్ద శత్రువులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరి మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఆరోగ్యంపై స్పందిస్తూ మొట్టమొదటి సారిగా బండి సంజయ్ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.@TelanganaCMO — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 11, 2022 -
సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులన్నీ నార్మల్‌గా (సాధారణంగా)నే ఉన్నట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గురువారం ఛాతిలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో సీఎంకు ఆస్పత్రిలో చెస్ట్ సీటీ, అబ్డామినల్ అల్ట్రాసౌండ్, కిడ్నీ కెయుబీ, లివర్ ఫంక్షనింగ్, డయాబెటిస్, ఇతర రక్త, మూత్ర పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. సీటీ స్కాన్ పరీక్షలో ఊపిరితిత్తుల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ కాగా.. ఆ మేరకు వైద్యులు యాంటీబయాటిక్ మందులు వాడాలని సీఎంకు సూచించిన విషయం విదితమే. రక్తపరీక్షల రిపోర్టులు శుక్రవారం వెలువడ్డాయి. రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యానికి ఢోకాలేదని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. చదవండి: (సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్) -
డాక్టర్ అనుమానాస్పద మృతి!
-
మాధవితో మాట్లాడాను : మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తండ్రిలో చేతిలో పాశవికంగా దాడికి గురైన మాధవి ప్రస్తుతం క్షేమంగా ఉందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవిని గురువారం కలిశానని ఆయన తెలిపారు. మాధవితో మాట్లాడానని, ప్రస్తుతం ఆమె చాలా ధైర్యంగా ఉందని.. తల్లి, తమ్ముడిని చూడాలని ఉందంటూ అడిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవికి వైద్యం అందించిన ఆస్పత్రి యాజమాన్యానికి, వైద్య బృందానికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. రక్షణ కల్పించడంలో విఫలం... మిర్యాలగూడ ప్రణయ్ హత్యపై దేశం మొత్తం స్పందించింది.. కానీ కేసీఆర్ మాత్రం స్పందించలేదని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణయ్, మాధవిల కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వమే ఇటువంటి ఘటనలపై స్పందించకపోతే శాంతి భద్రతలు ఎక్కడికి పోతాయంటూ ప్రశ్నించారు. 24 గంటల్లో ఈ ఘటనలపై కేసీఆర్ తన వైఖరి తెలపకపోతే.. 48 గంటల్లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు ఎవరివైపు? మాధవిపై అత్యంత పాశవికంగా దాడి జరిగితే.. మనోహరాచారి మద్యం మత్తులో హత్యాయత్నం చేశాడని డీసీపీ ఎలా చెబుతారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ చూస్తుంటే నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందంటూ ఆరోపించారు. -
మాధవి హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణాలతో పోరాడుతున్న మాధవి హెల్త్ బులిటెన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ..‘మాధవి ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటిలెటర్ తొలగించాం. 48 గంటల తర్వాత జనరల్ వార్డుకు తరలిస్తాం. తండ్రి ఇంత దారుణంగా దాడి చేయడంతో ఆమె తీవ్ర షాక్‌కు గురైంది. తన తల్లి.. తమ్ముడిని చూడాలని కోరింది. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండటంతో ఎక్కువ మందిని చూడటానికి అనుమతిని ఇవ్వటంలేదు’ అని తెలిపారు. అసలేం జరిగిందంటే.. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి, సెటిల్మెంట్ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు. బైక్‌పై వచ్చి మనోహర చారి బ్యాగులో తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేశాడు. ముందుగా సందీప్‌పై దాడి చేశాడు. మాధవి అడ్డుకోవడంతో ఆమెను విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. -
విషమంగానే మాధవి ఆరోగ్య పరిస్ధితి
-
ఇంకా వెంటిలేటర్‌పైనే మాధవి
సాక్షి, హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణలతో పోరాడుతున్న మాధవి హెల్త్ బులిటెన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మాధవికి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఇంకా ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. కత్తితో నరకడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందన్నారు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నలుగురు వైద్యుల బృందం ఆమెకి చికిత్స అందించిందన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ.. ‘మాధవి ఆస్పత్రికి వచ్చే సరికి చాలా రక్తస్రావం జరగడంతో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంది. 8 గంటలపాటు శ్రమించి రక్తస్రావాన్ని తగ్గించాం. ఆమెకు ఆరు బాటిళ్ల రక్తాన్ని ఎక్కించాం. మెడపై ఆమెకు తీవ్ర గాయమైంది. ముఖకవళికలకు సంబంధించిన నరాలు, మెదడుకు వెళ్లే ప్రధాన నరం, ఎడమ చేయి ఎముక పూర్తిగా దెబ్బతిన్నాయి. మూడు సర్జరీలు చేసి వాటిని సెట్ చేసాం. మెడపై ఉన్న గాయాలను తగ్గించే ప్రయత్నం చేశాం. తొలుత ఆమె ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించాం. ఆమె ఇతర ఆవయవాలపై ప్రభావం చూపకుండా ఈ శస్త్రచికిత్సలు నిర్వహించాం. ఇది చాలా సంతృప్తికరంగా సాగింది. అయినప్పటికీ మరో 48 గంటలు గడిస్తే గానీ మాధవి కండీషన్ చెప్పలే’మని తెలిపారు. -
కుటుంబం చిన్నాభిన్నం!
- విషాదం నింపిన బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం - మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి హైదరాబాద్: బంజారాహిల్స్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అన్నదమ్ముల్లో ఒకరు మృతిచెందగా మరొకరిని జీవచ్ఛవం చేసింది. మృతుడి వదిన కాలు విరిగింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి మృత్యువుతో పోరాడి ఓడింది. ఇంటి పెద్దయిన తండ్రి వెన్నుపూస విరిగి బతుకు మంచానికే పరిమితమైంది. కోలుకోని దెబ్బతీసిన ఈ దారుణం వారి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నెం.3లో పమ్మి రాజేష్(34) కారులో వెళుతుండగా పంజగుట్ట శ్మశానవాటిక వద్ద ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో జోగుతున్న యువకుడు వేగంగా కారు నడపడంతో, అది అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టి రాజేష్ కారుపై పడింది. ఇందులో రాజేష్ అక్కడికక్కడే మృతిచెందారు. పక్కనే కూర్చున్న తండ్రి మధుసూదనాచారి(65) వెన్నుపూస విరగడంతో ఆయనను యశోదా ఆస్పత్రిలో చేర్చారు. వెనకాల కూర్చున్న చిన్నారి రమ్య(8) తీవ్ర గాయాలై కేర్‌లో చికత్స పొందుతూ శనివారం మృత్యుఒడికి చేరింది. పక్కనే కూర్చుని తన గారాల బిడ్డ తొలి రోజు బడి కబుర్లు వింటూ మురిసిపోతున్న తల్లి రాధిక(32) కుడి కాలు విరిగి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి మరో సోదరుడు రమేష్ వెన్నెముక విరిగి ఆసుపత్రి పాల య్యారు. రాజేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరేం దుకు ఆదివారం అమెరికా పయనమవ్వాల్సిన శుభతరుణంలో చోటు చేసుకున్న ఈ ఘోరం కుటుంబం మొత్తాన్నీ విషాదంలో ముంచింది. మధుసూదనాచారికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వెంకటరమణ కూతురు రమ్య సికింద్రాబాద్ సెయింట్‌ఆన్స్ స్కూల్లో సీటు రావడంతో శుక్రవారం మొదటి రోజు హాజరైంది. ఉదయం స్కూల్లో కూతురిని దించి అక్కడే ఒక ఇల్లు చూసి వచ్చిన తండ్రి వెంకటరమణ... పాపను తీసుకుని వచ్చే క్రమంలో ఆ ఇల్లును చూసిరావాలంటూ తమ్ముడు రాజేష్, భార్య రాధిక, తండ్రి మధుసూదనాచారికి చెప్పారు. మారేడ్‌పల్లిలో ఇల్లు చూసి దారిలో రమ్యను ఎక్కించుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిందితుడి అరెస్ట్... రోడ్డు ప్రమాదానికి కారకుడైన బీటెక్ విద్యార్థి షవెల్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 304(పార్ట్-2) కింద కేసు నమోదు చేశారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం సేవించి అదుపుతప్పిన వేగంతో కారు నడుపుతూ ఈ ప్రమాదానికి కారకుడైనట్లు పోలీసులు తెలిపారు. షవెల్‌తోపాటు ఎన్.సూర్య, విష్ణు, అశ్విన్, సాయి రమేష్, అలెన్ జోసెఫ్ ఈ కారులో ఉన్నారు. బంజారాహిల్స్ సినీ మ్యాక్స్లోని టీజీఐ ఫ్రైడేస్‌లో మద్యం సేవించి కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థుల రక్త నమూనాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. -
మసాయిపేట బస్సు ప్రమాదంలో మరో విద్యార్థి మృతి
-
మసాయిపేట బస్సు ప్రమాదంలో మరో విద్యార్థి మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. సికింద్రాబాద్ లోని యశోద హస్పిటల్లో ఐదురోజులుగా చికిత్సపొందుతున్న తరుణ్ అనే విద్యార్థి మృతి సోమవారం సాయంత్రం మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ముసాయిపేట వద్ద గురువారం ఉదయం స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మృతి చెందిన సంగతిత తెలిసిందే.