సాక్షి, హైదరాబాద్: ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులన్నీ నార్మల్‌గా (సాధారణంగా)నే ఉన్నట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గురువారం ఛాతిలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో సీఎంకు ఆస్పత్రిలో చెస్ట్ సీటీ, అబ్డామినల్ అల్ట్రాసౌండ్, కిడ్నీ కెయుబీ, లివర్ ఫంక్షనింగ్, డయాబెటిస్, ఇతర రక్త, మూత్ర పరీక్షలు చేసిన విషయం తెలిసిందే.
సీటీ స్కాన్ పరీక్షలో ఊపిరితిత్తుల్లో మైల్డ్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కాగా.. ఆ మేరకు వైద్యులు యాంటీబయాటిక్ మందులు వాడాలని సీఎంకు సూచించిన విషయం విదితమే. రక్తపరీక్షల రిపోర్టులు శుక్రవారం వెలువడ్డాయి. రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యానికి ఢోకాలేదని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. చదవండి: (సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment