ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణలతో పోరాడుతున్న మాధవి హెల్త్ బులిటెన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మాధవికి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఇంకా ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు. కత్తితో నరకడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందన్నారు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నలుగురు వైద్యుల బృందం ఆమెకి చికిత్స అందించిందన్నారు.