హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు తమ దర్యాప్తు పూర్తి చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దక్షిణ మధ్య రైల్వే, కాకతీయ టెక్నో స్కూల్కు రైల్వే పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు.
కాకతీయ టెక్నో స్కూల్కు విద్యాశాఖ అనుమతి ఉందని, బస్సు ఫిట్నెస్ సరిగానే ఉందని నివేదికలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు సైకిలిస్టులు, పాలు విక్రయించే వ్యక్తుల నుంచి రైల్వే పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు బస్సు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడలేదని పేర్కొన్నారు. త్వరలో రైల్వే అధికారులు ఈ కేసును మూసివేయనున్నట్లు సమాచారం. కాగా గత నెల 24న మాసాయిపేట వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా 16మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. ఇప్పటికీ ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే పోలీసులు
Published Wed, Aug 27 2014 8:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement