bus driver ignored
-
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే పోలీసులు
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు తమ దర్యాప్తు పూర్తి చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దక్షిణ మధ్య రైల్వే, కాకతీయ టెక్నో స్కూల్కు రైల్వే పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. కాకతీయ టెక్నో స్కూల్కు విద్యాశాఖ అనుమతి ఉందని, బస్సు ఫిట్నెస్ సరిగానే ఉందని నివేదికలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు సైకిలిస్టులు, పాలు విక్రయించే వ్యక్తుల నుంచి రైల్వే పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు బస్సు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడలేదని పేర్కొన్నారు. త్వరలో రైల్వే అధికారులు ఈ కేసును మూసివేయనున్నట్లు సమాచారం. కాగా గత నెల 24న మాసాయిపేట వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా 16మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. ఇప్పటికీ ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
రైల్వే పోలీసుల నిర్ధారణ హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేటవద్ద గురువారం స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనకు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే ఆ బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా అనేది నిర్ధారించడానికి నిపుణులతో పరీక్షలు చేయించనున్నారు. ఈ ఘటనపై అన్నికోణాల నుంచి ై నిజామాబాద్ రెల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. కాగా రైల్వేలెవెల్ క్రాసింగ్ వద్ద పట్టాలను దాటే సమయంలో తగిన జాగ్రత్తలను తీసుకోకుండా బస్సుడ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు. రైలు వస్తున్న సమయంలో డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతుండటాన్ని చూసినట్టు స్థానికులు చెప్పారని ఆయన తెలిపారు. కాగా ఈ దుర్ఘటనపై సర్కార్కు సమగ్ర నివేదిక ఇచ్చేందుకు రైల్వేపోలీసు విభాగం ఇన్చార్జి డీజీ కృష్ణప్రసాద్ శుక్రవారం అధికారులతో సమీక్షించారు. -
31 మంది పిల్లల సజీవ దహనం
కొలంబియాలో బస్సు ప్రమాదం బొగోటా (కొలంబియా): ఒక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ముక్కుపచ్చలారని 31 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో 25 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వీరంతా ఒకటి నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయసు వారే. కొలంబియాలో ఫండాసియాన్ పట్టణంలోని ఒక చర్చిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా బస్సులో చెలరేగిన మంటలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ పరారైనా తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. డ్రైవర్ బస్సులో తీసుకెళ్తున్న పెట్రోల్ క్యాన్ కారణంగానే మంటలు చెలరేగాయని గాయాలతో బయటపడినవారు చెప్పారు.