బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం | reason for negligence of the bus driver | Sakshi
Sakshi News home page

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

Published Sat, Jul 26 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

రైల్వే పోలీసుల నిర్ధారణ

హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేటవద్ద గురువారం  స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనకు  బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని  ప్రాథమికంగా రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే ఆ బస్సుకు ఫిట్‌నెస్ ఉందా లేదా అనేది నిర్ధారించడానికి  నిపుణులతో పరీక్షలు చేయించనున్నారు. ఈ ఘటనపై అన్నికోణాల నుంచి ై నిజామాబాద్ రెల్వే పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. 

కాగా రైల్వేలెవెల్ క్రాసింగ్ వద్ద  పట్టాలను దాటే సమయంలో  తగిన జాగ్రత్తలను తీసుకోకుండా బస్సుడ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు.  రైలు వస్తున్న సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని  చూసినట్టు స్థానికులు చెప్పారని ఆయన తెలిపారు. కాగా ఈ దుర్ఘటనపై సర్కార్‌కు సమగ్ర నివేదిక ఇచ్చేందుకు రైల్వేపోలీసు విభాగం  ఇన్‌చార్జి డీజీ కృష్ణప్రసాద్ శుక్రవారం అధికారులతో సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement