
ఫ్లేవర్స్ ఆఫ్ చైనా
చైనీస్ ఫుడ్ అనగానే నాన్‌వెజ్ స్పైసీ ఐటెమ్స్ గుర్తుకు వస్తాయి. కానీ... ఇందుకు భిన్నంగా పూర్తి స్థాయి వెజ్ వెరైటీలతో ఫిలింనగర్ మయూరా హౌస్ ఎక్స్‌క్లూజివ్‌గా చైనీస్‌లో వెజ్ వంటకాలనే అందిస్తోంది. పన్నీర్, స్వీట్ కార్న్, సీజనల్ ఫ్రూట్స్, రేర్ డ్రైఫ్రూట్స్, చెరకు, పుట్టగొడుగులు, బేబీ కార్న్, బేబీ పొటాటోస్ వంటి ఐటెమ్స్‌తో ముప్ఫై రకాల పూర్తిస్థాయి శాకాహార రుచులను అందిస్తున్నారు శనివారం ప్రారంభమైన ‘ఫ్లేవర్స్ ఆఫ్ చైనా’లో. ఈ నెల 28 వరకు ఈ రుచులను ఆస్వాదించవచ్చు.