Celebrity Cricket
-
సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్.. ఘనంగా సీజన్ 2 పోస్టర్ లాంచ్ (ఫోటోలు)
-
పాన్ ఇండియా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (ఫొటోలు)
-
ఈ నెల 30న తారల క్రికెట్ సందడి..
చెన్నై సినిమా: కోలీవుడ్ వెండితెర, బుల్లితెర తారల క్రికెట్ పోటీలు ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న నటి నిరోషాలో ఓ క్రికెట్ వీరాభిమాని కూడా ఉన్నారు. దీంతో ఆమె తొలిసారిగా స్టార్స్ క్రికెట్ పోటీలను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మీడియా క్రికెట్ ఛాంపియన్ షిప్ పేరుతో ఈ నెల 30వ తేదీన స్థానిక పోరూరు టెన్నిస్ మైదానంలో ఈ పోటీలను ఏర్పాటు చేయనున్నారు. టోర్నీ వివరాలను సోమవారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన క్రీడాకారుల జెర్సీ, ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె వెల్లడించారు. ఈ పోటీలో ఆరు జట్లతో కూడిన 90 మంది నటులు పాల్గొననున్నారని నిరోషా తెలిపారు. గెలిచిన జట్టుకు రూ. లక్షన్నర నగదు బహుమతి, పలు కానుకలు అందిస్తామని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, టోర్నీని నిర్వహిస్తున్న మార్క్ సంస్థ నిర్వాహకులతో కలిసి గెలిచిన జట్టుకు ట్రోఫీని ప్రదానం చేస్తారని వెల్లడించారు. -
చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం స్టార్ క్రికెట్
ప్రతీ ఏడాది ఏదో ఒక సామాజిక కార్యక్రమం కోసం సినీ తారలందరూ క్రికెట్ ఆడటం సర్వసాధారణం. మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇబ్బందుల్లో ఉన్నవారికి కాస్తంత చేయూతను అందిస్తుంటుంది టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. ఈ సంవత్సరం కూడా మన సినీ స్టార్స్ క్రికెట్ ఆడటానికి ముందుకు వచ్చారు. ఈ విశేషాలను తెలియచేయడానికి శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో తరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రతి సారి లానే ఈ సారి కూడా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మంచి కాజ్ కోసమే క్రికెట్ ఆడటానికి ముందుకు రావడం జరుగుతోంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ సంస్థ అధినేత వర ప్రసాద్ గారు యుఎస్ లోని హ్యూస్టెన్‌లో ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. మొన్న సౌత్ ఆఫ్రీకాలో క్యాన్సర్ పేషంట్స్ కోసం ఆడాము. మరొకసారి బ్లైండ్ ఛారిటీకోసం క్రికెట్ ఆడటం జరిగింది. అలానే ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ చారిటీ కోసం మ్యాచ్ ఆడటం జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆగస్టు 17న జరగనుంది. అలానే ఈ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఆర్గనైజషన్‌తో నెక్స్ట్ 5ఇయర్స్ వరకు ప్రతి ఏటా ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఈ మ్యాచెస్‌ను ఆడటానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు హ్యూస్టెన్‌లో, నెక్స్ట్ న్యూ జెర్సీ, ఆతరువాత ఫ్లోరిడా ఇలా ఆల్ ఓవర్ ది యూస్‌లో మ్యాచ్‌లను ఆడనున్నాము. చాలా స్ట్రాంగ్ టీమ్‌తో వెళ్తున్నాము’. అంటూ తెలియచేసారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మంచి కాజ్ కోసం ఆడుతున్నాము.. సీరియస్‌గా గెలవాడానికే ఆడనున్నాము. మన దేశంలో కాకుండా ఇతర దేశంలో ఆడటం డిఫరెన్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను కలిగిస్తోంది’ అన్నారు. నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఎప్పటినుంచో నేను క్రికెట్ టీమ్‌లో భాగం అవ్వాలని ఉంది. అది ఇప్పటికి కుదిరింది. శ్రీకాంత్, తరుణ్ నన్ను సపోర్ట్ చేశారు. 1992లో రంజీ ట్రోఫీ టీమ్‌లో నేను మెంబర్.. బాగానే ఆడేవాణ్ణి. ఇప్పడు ఈ టాలీవుడ్ క్రికెట్ టీమ్‌లో ఆడటం సంతోషంగా ఉంది’ అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘గత కొన్ని సంవత్సరాలుగా టీసీఏ మంచి కాజ్ కోసం ఆడుతూనూనే ఉంది. అదే దిశగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఈవెంట్ చేయడం వారి ఆధ్వర్యంలో టిసిఎ క్రికెట్ ఆడటం ఆనందంగా ఉంది. ఆగస్టు 15న యూఎస్ లో ఫ్లాగ్ హ్యస్టింగ్ చేసి 17న మ్యాచ్‌ను ప్రారంభించనున్నాము. అక్కడ ఉన్న బిడ్డింగ్ టీమ్‌ను సెలెక్ట్ చేయనున్నారు. వారు కూడా మాపై గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన ఇండియన్స్‌తో మేము ఆడటం చాలెంజింగ్‌గా అనిపిస్తోంది. ప్రతి ఒక్క ఇండియన్ ఇందులో పార్టిసిపేట్ చేయచ్చు. ఎన్నో మంచి కాజ్‌ల కోసం ఆడిన మేము ఈసారి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఆడటం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది’ అన్నారు. -
టాలీవుడ్ హీరోలు వర్సెస్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో : కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పోలీసు క్రికెట్ లీగ్ విజయవంతమైందని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసు క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తలపడుతుందని తెలిపారు. క్రికెట్‌తో ప్రజలతో మమేకమైన తీరు, సెలబ్రిటీల కామెంట్లతో కూడిన టీజర్ (వీడియో)ను బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో శనివారం సీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో ముఖ్యంగా యువతతో భాగస్వామ్యం అవుతూ ఏప్రిల్ 10 నుంచి కాలనీ, సెక్టార్ లెవల్, ఠాణా స్థాయి, డివిజనల్ స్థాయి, జోనల్ స్థాయిల్లో క్రికెట్ పోటీలు నిర్వహించామన్నారు. ఇప్పటివరకు 270 జట్ల నుంచి 4050 మంది ఆటగాళ్లు పోటీల్లో పాల్గొన్నారన్నారు. అన్ని విభాగాల్లో 44000 ప్రజలు భాగస్వామ్యులయ్యారు. పోలీసు క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఎల్బీస్టేడియంలో ఆదివారం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టుతో తలపడుతుందని తెలిపారు. ఈ మ్యాచ్ సందర్భంగా సాంస్కృతిక శాఖ నుంచి కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆదివారం జరిగే మ్యాచ్‌కు నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమానికి హోం మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, ఈస్ట్‌జోన్ డీసీపీ రమేశ్‌లు పాల్గొన్నారు. స్టార్ ప్లేయర్లు వీరు... సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టు తరఫున నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి, అఖిల్, నాని, శ్రీకాంత్, విజయ దేవరకొండ, నితిన్ తదితరులు పాల్గొంటారు. వీరితో పోలీసు క్రికెట్ జట్టు తలపడనుంది. టీజర్‌ను విడుదల చేస్తున్న నగర సీపీ అంజనీకుమార్ -
17న సెలబ్రిటీ క్రికెట్
తమిళసినిమా: చెన్నై వాసులకు ముఖ్యంగా సినీ అభిమానులను కనువిందు చేయడానికి,ఆనందోత్సాహాలను కలిగించడానికి తమిళ ఉగాది పండ గ వెంటనే మరో వేడుక జరగనుంది. అదే సెలబ్రిటీ క్రికెట్. సాధారణంగా క్రికెట్ అంటేనే అభిమానులకు ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇక తమ అభిమాన తారలు స్టేడియంలో ఫోర్లు,సిక్సర్లు అంటూ బ్యాట్‌ను ఝుళిపించి బంతులను పరిగెత్తిస్తుంటే ఆ జోషే వేరు. అలాంటి తరుణం ఈ నెల 17న రానుంది. దక్షిణ భారత నటీనటుల సంఘ భవన నిర్మాణం కోసం నిధిని సేకరించడంలో భాగంగా నిర్వహించనున్న ఈ స్టార్స్ సెలబ్రిటీ క్రికెట్ క్రీడకు చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదిక కానుంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొననున్న ఈ క్రికెట్ క్రీడను స్టార్ నటులు 8 జట్లుగా ఆడి ఆనందాలను పంచనున్నారు. ఒక్కో జట్టు ఆరు ఓవర్లు ఆడనున్నారు. ఈ జట్లకు కెప్టెన్ బాధ్యతలను నిర్వహించే వారి వివరాలను సోమవారం ఒక స్టార్ హోటల్లో సంఘం నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ 8 జట్లలో రామ్రాజ్ చెన్నై సింగమ్స్ జట్టుకు నటుడు సూర్య, ఎస్థల్ మదురై కాళైస్ జట్టుకు నటుడు విశాల్, శక్తి మసాలా కోవై కింగ్స్‌కు నటుడు కార్తీ, ఎమ్జీఆర్ యూనివర్సిటీ నెల్లై డ్రాగర్స్ జట్టుకు జయంరవి, రామ్నాట్ రైనోస్ జట్టుకు విజయ్‌సేతుపతి, తంజై వారియర్స్ జట్టుకు నటుడు జీవా, సేలం చీటర్స్ జట్టుకు నటుడు ఆర్య, కల్యాణ్ జ్యువెలర్ తిరుచ్చి టైగర్స్ జట్టుకు శివకార్తికేయన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ క్రీడకు సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్ అదనపు ఆకర్షణ కానున్నట్లు ఇంతకు ముందు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది.అయితే ఆ విషయం గురించి ఇప్పుడు ప్రస్థావించకపోవడం గమనార్హం. సమావేశంలో పలువురు నటీనటులతోపాటు దర్శక,నిర్మాతలు పాల్గొన్నారు. -
11 నుంచి సెలబ్రిటీ క్రికెట్
తమిళసినిమా:సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సందడి ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది.సినీ తారల క్రికెట్‌కు ఈసారి కూడా రెట్టింపు జోష్‌తో సిద్ధం అవుతున్నట్లు చెన్నై రైనోస్ జట్టు కొత్త కెప్టెన్ నటుడు జీవా పేర్కొన్నారు. ఈ లీగ్ పోటీలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సీసీఎల్ పోటీల వివరాలను గురువారం జీవా టీమ్ విలేకరులకు వెల్లడించారు. నటుడు జీవా వెల్లడిస్తూ ఈ జట్టుకు ఇంతవరకు నటుడు విశాల్ కెప్టెన్ బాధ్యతల్ని నిర్వహించేవారన్నారు. ప్రస్తుతం ఆయన చిత్రాలతో బిజీగా ఉండడంతో తానా బాధ్యతల్ని నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ జట్టుకు నటుడు విష్ణు విశాల్, వైస్ కెప్టెన్ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్య, విక్రాంత్, రమణ, భరత్, పృథ్వీ, శాంతను, అశోక్ సెల్వన్, బాలాజీ శ్యామ్, వేస్ వెంకట్, చరణ్‌కుమార్, ఉదయకుమార్, సంజయ్ భారతి జట్టు తరపున ఆడనున్నారని పరిచయం చేశారు. ఈ చెన్నై రైనోస్ నిర్వాహకుడు జి.వి.ఆర్.గ్రూప్ గంగాప్రసాద్ మాట్లాడుతూ ఈ లీగ్‌లో చెన్నై రైనోస్‌తో పాటు తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై ఇండియన్స్, వీర మరాఠి, బెంగాల్ టైగర్స్, భోజ్‌పురి ద బాగ్స్ జట్లు పోటీలో పాల్గొంటున్నాయని వెల్లడించారు. చెన్నై రైనోస్ ఈ నెల 11న హైదరాబాదులో జరగనున్న లీగ్‌లో కేరళ స్ట్రైకర్స్తోను, 18న బెంగళూరులో జరిగే లీగ్‌లో వీరమరాఠి జట్టుతోను, 25న అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌తోను తలపడనుందని తెలిపారు. ఆ తరువాత ఫైనల్ మ్యాచ్ ఉంటుందని చెప్పారు. ఈసారి సీసీఎల్ క్రికెట్ పోటీలు చెన్నైలో జరగకపోవడం ఇక్కడి అభిమానులకు నిరాశ కలిగిందన్నారు.అయితే అనుమతి సమస్య కారణంగా చెన్నైలో సీసీఎల్‌ను నిర్వహించలేకపోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.