
టి.బిల్లుకు కాంగ్రెస్ నేతల మద్దతే లేదు: నామా
తెలంగాణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే మద్దతు ఇవ్వడం లేదు తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అవినీతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న లోక్పాల్ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
లోక్పాల్ బిల్లు 10 ఏళ్ల క్రితమే చట్టంగా రూపొందాల్సిందని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలా చేసి ఉంటే కాంగ్రెస్ తొమ్మిదేళ్ల కాలంలో చేసిన దోపిడికి అడ్డుకట్ట వేసినట్లు అయ్యేదని ఆయన పేర్కొన్నారు.