
విభజన కోసమే చంద్రబాబు దీక్ష: ఎంపి నామా
ఢిల్లీ: తెలంగాణ ప్రక్రియ ఆపాలన్నది తమ నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లక్ష్యంకాదని ఆ పార్టీ ఎంపి నామా నాగేశ్వర రావు స్పష్టం చేశారు. పద్ధతి ప్రకారం విభజన చేయమని చంద్రబాబు దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రేపు మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు దీక్ష ప్రారంభిస్తారన్నారు.
రాష్ట్రాన్ని పద్దతి ప్రకారం విభజించి, సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలనేది చంద్రబాబు దీక్ష లక్ష్యం అని నామా వివరించారు. తెలంగాణ ప్రక్రియ ఆపాలని తాము కోరుకోవడంలేదని చెప్పారు. తెలంగాణ బిల్లు పెడితే మొదటి ఓటు తామే వేస్తామని చెప్పారు.