
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ రాజీనామా చేసినఆ పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. నామ నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నేతలు బేబి స్వర్ణకుమారి, అమర్నాథ్ బాబు, అట్లూరి రమాదేవి, బ్రహ్మయ్య తదితరులు కూడా టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున పోటీ చేసిన నామా నాగేశ్వరరావు ఆ ఎన్నికల్లో పరాజయం పొందిన సంగతి తెలిసిందే.