
బిల్లు ఆమోదానికి సహకరిస్తాం: నామా
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తెలంగాణ బిల్లును దయచేసి అడ్డుకోవద్దని సీమాంధ్ర నేతలను టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. 40 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల నెరవేరబోతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు తమ పార్టీ కట్టుబడివుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన కోసం టీడీపీ మూడు లేఖలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ లేఖలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదని వెల్లడించారు. తమ పార్టీ తరపున తెలంగాణకు మద్దతు ఎంత ఉందో దీని బట్టి తెలుస్తుందన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి తామూ పూర్తిగా కూడా సహకరిస్తామని హామీయిచ్చారు. తెలంగాణకు అడ్డుతగలొద్దని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.